
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా జటాధర. భారీ యాక్షన్ ఫాంటసీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాను నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ భాషలలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా విలన్ గా కనిపించనున్నారు. అలాగే శిల్పా శిరోద్కర్ సైతం కీలకపాత్ర పోషించనున్నారు. మొదటిసారి తెలుగు సినీరంగంలోకి జటాధర సినిమాతో అడుగుపెట్టనుంది సోనాక్షి. రహస్య శక్తులు, యాక్షన్ సన్నివేశాలు, ఫాంటసీ టచ్ తో కూడిన ఈ సినిమా సోనాక్షి కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
కొన్ని రోజులుగా జటాధర సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న సోనాక్షి.. తన కెరీర్, పర్సనల్ విషయాలను సైతం పంచుకుంటుంది. తాజాగా తన పాత్రకు సంబంధించి సోనాక్షి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. తన కెరీర్ లో ఫిజికల్ గా అత్యంత కష్టమైన పాత్ర ఇదే అని అన్నారు సోనాక్షి మాట్లాడుతూ.. “నా కెరీర్ లో ఇది ఫిజికల్ గా అత్యంత కష్టమైన పాత్ర. నేను ధరించిన ఆభరణాల బరువు ఏకంగా 50 కిలోలు ఉండేది. ప్రతిరోజు షూటింగ్ కు సిద్ధం కావడానికి మూడు గంటల సమయం పట్టేది. ఆ కాస్ట్యూమ్ వేసుకుని కదలడమే కష్టం.. కానీ యాక్షన్ సీన్స్ చేయడం మరింత ఛాలెంజ్ గా మారింది. ఆభరణాలు చీరకు కుట్టి వేసేవారు. యాక్షన్ సమయంలో అవి కదలకుండా ఉండేందుకు అలా చేయాల్సి వచ్చేది. రోజంతా ఆ డ్రెస్సులో ఉండడం అలసట కలిగించేది కానీ ఆ పాత్ర అందించిన సంతృప్తి మాత్రం అపారమైనది” అని చెప్పుకోచ్చింది.
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
తెలుగు టీమ్ చాలా ఫ్యాషన్ తో పనిచేసిందని.. జటాధర విజువల్ గా భావోద్వేగంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపింది. ఇన్నాళ్లు హిందీలో వరుస సినిమాల్లో నటించిన ఈ భామ.. ఇప్పుడు తెలుగు అడియన్స్ ముందుకు వస్తుంది.
Sonakshi Sinha
ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?