Sobhita Dhulipala: మహేష్ బాబు గారు మాకు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు.. ఆసక్తికర విషయాలు చెప్పిన శోభితా ధూళిపాళ

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో అడవి శేష్. ఈ  వెర్సటైల్ స్టార్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'.

Sobhita Dhulipala: మహేష్ బాబు గారు మాకు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు.. ఆసక్తికర విషయాలు చెప్పిన శోభితా ధూళిపాళ
Sobhita Dhulipala
Follow us

|

Updated on: May 22, 2022 | 7:40 AM

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో అడవి శేష్( Adivi Sesh). ఈ  వెర్సటైల్ స్టార్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మేజర్’ లో కీలక పాత్ర పోషించిన నటి శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala)మేజర్ చిత్ర విశేషాలను పంచుకున్నారు..

శోభితా మాట్లాడుతూ.. ‘గూడచారి’ సినిమా చేస్తున్నపుడే హీరో అడవి శేష్ కి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అంటే ఒక ఆరాధన భావం గమనించాను. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై శేష్ ఎప్పటి నుండో రీసెర్చ్ చేస్తున్నారు. గూడచారి షూటింగ్ లో సందీప్ జీవితం గురించి చాలా ఆసక్తికరమైన సంగతులు చెప్పేవారు. ఐతే ఈ సినిమాలో నేను కూడా చేస్తానని అప్పుడు తెలీదు. ఒకవిధంగా ఈ కథకి నేనే ఫస్ట్ ఆడియన్ అన్నారు. అలాగే నాకూ తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలనే వుంది. ఈ గ్యాప్ కి కరోనా ఒక కారణంగా భావిస్తా. కరోనా లేకపోతె మేజర్ ఏడాది క్రితమే వచ్చేది. ఐతే సౌత్ లో కురుప్ సినిమా చేశా. అలాగే మణిరత్నం గారి తో పొన్నియన్ సెల్వన్ చేస్తున్నా. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నా కానీ తెలుగులోనే ఐతే సరిగ్గా కుదరడం లేదు. అయితే రానున్న రోజుల్లో తెలుగు లో కూడా ఎక్కువ సినిమాలు చేయాలని ఆశిస్తున్నా అన్నారు శోభితా.

మేజర్ లో ప్రమోద అనే పాత్రలో కనిపిస్తా. సినిమాలో ఒక పక్క సందీప్ జీవితం చూపిస్తూ.. మరో పక్క 26/11 దాడులు, తాజ్ ఇన్సిడెంట్ ని సమాంతరంగా చూపిస్తారు. నేను 26/11 ఎటాక్స్ లో బందీగా కనిపిస్తా. భయం ,ఏడుపు , ధైర్యం, నమ్మకం, ఆశ, నిరాశ .. ఇలా బోలెడు కోణాలు నా పాత్రలో కనిపిస్తాయి. భావోద్వేగాలలో చాలా బరువైన పాత్ర. నిజ జీవితంలో ఒక వ్యక్తి దాడులని, బాధని ఎదురుకున్నారు. కాబట్టి కేవలం సినిమాటిక్ గా కాకుండా ఒక బాధ్యతతో చేసిన పాత్ర నాది అన్నారు. అలాగే మహేష్ బాబు బ్యానర్ లో పనిచేయడం గురించి మాట్లాడుతూ.. నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. మహేష్ బాబు గారిది గ్రేట్ కెరీర్. అలాంటి సూపర్ స్టార్ తన జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్ లో మొదటిసారి బయట సినిమా చేశారు. ఇది మాకు గొప్ప ఎనర్జీ నింపింది. కరోనా సమయంలో చాలా అందోళన పడ్డాం. ఓటీటీకి వెళ్ళిపోతుందేమోనని భయపడ్డాం. కానీ మహేష్ బాబు గారు మాకు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. ‘ఇది థియేటర్ సినిమా ..ఎట్టి పరిస్థితిలో థియేటర్ లోనే విడుదలౌతుందని’ చెప్పారు. ఆయన మార్గదర్శకం, ప్రోత్సాహం మాలో గొప్ప నమ్మకాన్ని నింపింది. మంచి నిర్మాణ సంస్థలో పని చేశాననే ఆనందం వుంది అన్నారు శోభిత.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: ‘ఆ సినిమా మరో సారి చేయాలని ఉంది’ మనసులోమాట బయటపెట్టిన మహేష్

“ఆ క్షణాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటా తాకర్” తారక్‌ కు చెర్రీ ఎమోషనల్ విషెస్

Anil Ravipudi: ఎన్టీఆర్ మూవీ చేయడంపై అనిల్ రావిపూడి క్లారిటీ

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో