
శోభన్ బాబు మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దాసరి నారాయణరావు తెలిపారు. ఎంతో క్రమశిక్షణతో, ఒత్తిడి లేకుండా జీవించిన ఆయన 97 ఏళ్లు బతుకుతానని చెప్పేవారు. మరణం గురించి ఊహించని విధంగా ఆయన వెళ్లిపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
వివరాల్లోకి వెళ్తే.! నిర్మాత, దర్శకుడు దాసరి నారాయణరావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్టార్ నటుడు శోభన్ బాబు మరణం తనను ఎంతగానో బాధించిందని, ఊహించని సంఘటనగా మిగిలిపోయిందని గుర్తు చేసుకున్నారు. దివంగత నటుడు శోభన్ బాబు జీవితంలో టెన్షన్ అనే పదాన్ని ఎప్పుడూ దరిచేరనీయని, ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. శోభన్ బాబు తరచుగా “నేను 97 ఏళ్ళు బతుకుతాను బావ” అని సరదాగా చెప్పేవారని, మిగిలిన మూడేళ్ళు దేనికోసం అంటే, “పైకి వెళ్ళడానికి ట్రావెలింగ్‌కి గ్రేస్ కావాలి కదా, అందుకే గ్రేస్ ఇస్తున్నాను” అని చెప్పేవారని వివరించారు. ఈ విధంగా తన జీవితకాలం గురించి ఎంతో గ్రేస్‌గా, హాస్యంగా చెప్పే శోభన్ బాబు అకస్మాత్తుగా మరణించడం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని దాసరి నారాయణరావు ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కాగా, పలువురు నటులు.. శోభన్ బాబుకు చుట్టూ ఉన్నవాళ్లే ఆయన్ని మోసం చేశారని చెప్పిన సందర్భాలు లేకపోలేదు.