SivaKarthikeyan : ‘ఆ ఇద్దరు డైరెక్టర్స్ సినిమాలంటే చాలా ఇష్టం.. రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలని ఉంది’.. శివకార్తికేయన్ కామెంట్స్..

|

Oct 20, 2022 | 7:53 PM

ప్రిన్స్ స్టొరీ ఐడియా చాలా ఎక్సయిట్ చేసింది. ఒక ఇండియన్ బ్రటిష్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరిలో మనుషులు మైండ్ సెట్ డిఫరెంట్ గా వుంటుంది. ప్రేమ,పెళ్లి విషయాల్లో వారిది ఒక ఖచ్చితమైన మైండ్ సెట్.

SivaKarthikeyan : ఆ ఇద్దరు డైరెక్టర్స్ సినిమాలంటే చాలా ఇష్టం.. రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలని ఉంది.. శివకార్తికేయన్ కామెంట్స్..
Sivakarthikeyan
Follow us on

రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు తమిళ్ స్టార్ శివకార్తికేయన్. వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుంత టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కిన కంప్లీట్ ఎంటర్టైనర్ ‘ప్రిన్స్’. తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయిక గా నటిస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 21న ‘ప్రిన్స్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో హీరో శివకార్తికేయన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

శివకార్తికేయన్ మాట్లాడుతూ.. ” ఆర్టిస్ట్ గా అన్ని చోట్ల సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించాలని, ప్రశంసలు అందుకోవాలని వుంటుంది. ప్రిన్స్ విషయానికి వస్తే.. ఫన్ సినిమాలు తగ్గిపోతున్నాయి. నా వరకూ కామెడీ సినిమాలు చేయడం చూడటం చాలా ఇష్టం. ఇలాంటి సమయంలో నా స్నేహితుడి ద్వారా ఒకసారి అనుదీప్ ని కలిశాను. ఆయన చెప్పిన లైన్ చాలా నచ్చింది. తర్వాత అది ‘ప్రిన్స్’ గా మారింది. ప్రిన్స్ యూనివర్షల్ సబ్జెక్టు. తెలుగు, తమిళ ప్రేక్షకులు అనే తేడా లేకుండా అందరికీ నచ్చుతుంది. డైలాగ్స్, కామెడీ చాలా ఆర్గానిక్ గా వుంటాయి. అనుదీప్ జాతిరత్నాలు చూశాను. అనుదీప్ రాసుకునే పాత్రల్లో స్వచ్చమైన అమాయకత్వం వుంటుంది. పాత్రలు ఊహించని విధంగా రియాక్ట అవుతాయి. ప్రిన్స్ స్టొరీ ఐడియా చాలా ఎక్సయిట్ చేసింది. ఒక ఇండియన్ బ్రటిష్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరిలో మనుషులు మైండ్ సెట్ డిఫరెంట్ గా వుంటుంది. ప్రేమ,పెళ్లి విషయాల్లో వారిది ఒక ఖచ్చితమైన మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ని బ్రేక్ చేసే ఆలోచన చాలా ఎక్సయిట్ చేసింది. ఇందులో సత్యరాజ్ గారి పాత్ర కూడా నన్ను ఎక్సయిట్ చేసింది. సత్యరాజ్ పాత్ర తన కొడుకుతో ”మన కులం, మతం అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు” అని చెబుతుంది. చాలా యూనిక్ క్యారెక్టర్ ఇది.

ప్రిన్స్ ప్రాజెక్ట్ ఒక సవాల్ తో కూడుకున్నది. అనుదీప్ తెలుగులో రాశారు. తెలుగు స్క్రిప్ట్ ని తమిళ్ చేయడం ఒక సవాల్ గా తీసుకొని వర్క్ చేశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. భవిష్యత్ లో కూడా ద్విభాష చిత్రాలు చేయాలనే ఆలోచన వుంది. విజయ్, వంశీ పైడిపల్లి గారితో సినిమా చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ – శంకర్ గారు కలసి పని చేస్తున్నారు. రెండు పరిశ్రమలో కలసి సినిమా చేయడం చాలా మంచి పరిణామం. కేజీఎఫ్,ఆర్ఆర్ఆర్, విక్రమ్, కాంతార చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. సౌత్ పరిశ్రమ ఇప్పుడు గొప్ప స్థితిలో వుంది. టీవీలో పని చేసి సినిమాల్లోకి వచ్చాను. చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ సోలో హీరోగా ఎదిగాను. ప్రతి అనుభవం నా కెరీర్ కి ఉపయోగపడింది. ఈ పదేళ్ళలో ప్రేక్షకులు పంచిన ప్రేమని మర్చిపోలేను. రాజమౌళి గారితో కలసి పని చేయాలని అందరికీ వుంటుంది. అలాగే త్రివిక్రమ్, సుకుమార్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ” అంటూ చెప్పకొచ్చారు.