Sivakarthikeyan: జాతిరత్నం డైరెక్షన్‌లో శివకార్తికేయన్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారే..

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ ఇప్పుడు తెలుగు సినిమాతో ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడు.

Sivakarthikeyan: జాతిరత్నం డైరెక్షన్‌లో శివకార్తికేయన్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారే..
Prince Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 25, 2022 | 4:59 PM

ప్రస్తుతం టాలీవుడ్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో పొరుగు బాషా హీరోలంతా తెలుగులో సినిమా చేయడానికి సిద్దపడుతున్నారు. ఈ క్రమంలోనే శివకార్తికేయన్ కూడా స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి జాతిరత్నలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనుదీప్ కెవి ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాడు. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు’ప్రిన్స్’ అనే టైటిల్ ను ఖరారు చేశాడు. ఈ మూవీలో శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది.

ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్‌లు భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగల్ ”బింబిలిక్కి పిలాపి” చార్ట్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం నుండి ‘జెస్సికా’ లిరికల్ వీడియోని విడుదల చేశారు. సంగీత సంచలనం ఎస్ తమన్ ఈ పాటని తనదైన స్టయిలీష్ బీట్ లో డ్యాన్స్ నెంబర్ గా కంపోజ్  చేశారు. తమన్ ఈ పాటని స్వయంగా పాడటంతో పాటు లిరికల్ వీడియోలో ఆయన కనిపించడం మరో విశేషం. తమన్ వాయిస్ లో ఈ పాట ఇన్స్టంట్ అడిక్షన్ గా అలరిస్తోంది. శివకార్తికేయన్ ఈ పాటకు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ మైండ్ బ్లోయింగ్ గా వున్నాయి. శివకార్తికేయన్,  మారియా కెమిస్ట్రీ మెస్మరైజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఇన్స్టంట్ అడిక్షన్ గా అలరించిన జెస్సికా పాట ప్రిన్స్ ఆల్బమ్ లో మరో చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను తనదైన కామెడీ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నాడు అనుదీప్. మరి ఈ సినిమా శివకార్తికేయన్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. చిత్రయూనిట్ మాత్రం ఈ సినిమా పై చాలా ధీమాగా ఉన్నారు. సినిమా అద్భుతంగా వస్తుందని.. ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని చిత్రయూనిట్ చెప్తుంది. ఈ సినిమాతో శివకార్తికేయన్ కెరీర్ లో మరో హిట్ పడటం ఖాయం అంటున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా సీతారామం సినిమాతో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సంచలన విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఇప్పుడు ఈ సినిమాతో శివకార్తికేయన్ కూడా సూపర్ హిట్ అందుకోవాలని ఆశపడుతున్నాడు. మరి ఈ యంగ్ హీరో ఆశలు ఫలిస్తాయేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే