అందుకే పార్ట్ 2 నేను డైరెక్ట్ చెయ్యలేదు: గూఢచారి దర్శకుడు..
13 March 2025
Prudvi Battula
అడివి శేష్, శశికిరణ్ టిక్కా కాంబినేషన్‌లో వచ్చిన స్పై ఎంటర్టైనర్ గూఢచారి సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ బ్లాక్ బస్టర్ కి కొనసాగింపుగా తెరకెక్కితున్న సినిమా గూఢచారి 2. ఈ సినిమాపై ప్రేక్సకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ స్పై సినిమా సీక్వెల్ ని శశికిరణ్ కాకుండా.. వినయ్ కుమార్ అనే మరో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.
దీనిపై స్పందిస్తూ.. శేష్, తాను కలిసి తీసుకున్న నిర్ణయమే ఇది అని తెలిపారు గూఢచారి దర్శకుడు శశికిరణ్ టిక్కా.
తను ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్లే గూఢచారి 2ని మరో దర్శకునికి వదిలేయాల్సి వచ్చిందని చెప్పారు అయన.
ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జారుతుంది. ఇందులో శోభిత ధూళిపాళ కీలక పాత్రలో నటిస్తుంది. త్వరలోనే విడుదల కానుంది.
ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ ట్రోలింగ్ తట్టుకోలేకపోయాను: మృణాల్..
జాన్వీ డైలీ ఫుడ్ రొటీన్ ఏంటో తెలుసా.?
సంయుక్తకి సొంత హెల్పింగ్ ఫౌండేషన్ ఉందా.?