Sirivennela Seetharama Sastri: తెలుగు సాహిత్యం మూగబోయినట్టుగా.. పాట ప్రయాణం ఆగిపోయింది..

|

Nov 30, 2021 | 6:04 PM

సినీపాటల సిరివెన్నెల చీకటైంది.. వెలుగుల పాట ఆగిపోయింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్తను వెండితెర ఇంకా

Sirivennela Seetharama Sastri: తెలుగు సాహిత్యం మూగబోయినట్టుగా.. పాట ప్రయాణం ఆగిపోయింది..
Sirivennela Seetharamashast
Follow us on

సినీపాటల సిరివెన్నెల చీకటైంది.. వెలుగుల పాట ఆగిపోయింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్తను వెండితెర ఇంకా నమ్మలేకపోతుంది. సిరివెన్నెలకు కన్నీటి వీడ్కోలు తెలుపుతుంది తెలుగు చిత్రపరిశ్రమ.. గురువుగారు.. ఏంటీ ఇలా చేశారు.. తెలుగు సాహిత్యం ఒక్కసారిగా మూగబోయినట్టుగా అనిపిస్తుంది. మన పాట ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయిందా.. మనసుకి నొప్పిగా ఉంది గురువుగారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు ఆర్పీ పట్నాయక్..

ట్వీట్..

మీ పాటలే మేము నేర్చుకొన్న పాఠాలు
మీ సూక్తులు మేము రాసుకొనే మాటలు
బ్రహ్మ ఒక్కడే కష్టపడుతున్నాడు అని సాయం గా ఇంత తొందరగా వెళ్లిపోయారా ?
నా పాట పూర్తి చేసి వెళ్లిపోయారు కానీ పాఠం మధ్యలోనే వదిలేసారు గురూజీ
భరించలేని నిజం చెవులు వింటున్నాయి
కానీ మనసు ఒప్పుకోవటం లేదు అంటూ సిరివెన్నెలకు నివాళి అర్పించారు డైరెక్టర్ మారుతీ.

ట్వీట్..

సాహిత్య ప్రపంచానికి.. తెలుగు సినిమా రంగానికి మీ సహకారం మరువలేనిది సార్. ఈ శూన్యం ఎప్పటికీ మనతోనే ఉంటుంది .. అంటూ ఎమోషనల్ అయ్యారు హీరో సాయి ధరమ్ తేజ్..

ట్వీట్..

Also Read: Sirivennela Sitaramasastri: సినీ గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

sirivennela seetharama sastri: సినిమా పాటకు సిరివెన్నెల చెదిరిపోయింది! సంతాపం తెలుపుతున్న ప్రముఖులు..