
Sirivennela Seetharama Sastry: సినీ పరిశ్రమ మూగబోయింది. సినీ వినీలాకాశంనుంచి ఓ దృవతార నేలరాలింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూతతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. అనారోగ్యంతో సిరివెన్నల కనుమూశారు. సినిమా ప్రేమికులంతా సాహిత్య లోకానికి చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు. గత కొద్దిరోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఈనెల 24న సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్న కిమ్స్ వైద్యులు ఎప్పటికప్పుడు సిరివెన్నెల ఆరోగ్యాన్ని పరీశిలిస్తూ వచ్చారు. కాగా.. సిరివెన్నెల ఆరోగ్యం మరింత క్షీణించడంతో నవంబర్ 31న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి, తమన్, త్రివిక్రమ్, ప్రకాష్ రాజ్, ఉత్తేజ్ హాస్పటల్ కు చేరుకున్నారు.
ఇక కొద్దిసేపటి క్రితమే అయన పార్థివదేహాన్ని అభిమానులు సినీ ప్రముఖుల సందర్శనార్ధం ఫిల్మ్ చాంబర్ కు తరలించారు. దర్శకుడు రాజమౌళి, కీరవాణి సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించారు. నేడు ఫిల్మ్ నగర్లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలను నిర్వహించనున్నారు. సిరివెన్నెలకు ఆరేళ్ల క్రితం క్యాన్సర్ వచ్చింది. దీంతో ఆయనకు సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బైపాస్ సర్జరీ కూడా జరిగింది. సిరివెన్నెల గత ఐదు రోజులుగా ఎక్మో మిషన్ పైనే ఉన్నారు. ఎక్మో మిషన్ పై ఉన్న తర్వాత.. క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఒబీస్ పేషెంట్ కావడం, కిడ్నీ డ్యామేజ్ కావడంతో ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకింది. దీంతో మంగళవారం 4 గంటల 7 నిమిషాల ప్రాంతంలో సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు అని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. సిరివెన్నెల అస్తమించడంతో సినీ ప్రపంచం మూగబోయింది. కవిత్వానికి ఒంపులు అక్షరంలో అందాలు గుర్తించిన ఆయనకు అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ఉత్తమ గీత రచయితగా 11సార్లు నంది అవార్డు అందుకున్నారు. సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు రాసిన మొదటి పాట విధాత తలపున.. దీంతో అవార్డులు అందుకోవడం ఆయనకు మొదలైంది.
మరిన్ని ఇక్కడ చదవండి :