Sirivennela Sitarama sastri: అత్యంత విషమంగా సిరివెన్నెల ఆరోగ్యం.. ఐసీయూలో చికిత్స..

Sirivennela Seetharama Sastry Death: టాలీవుడ్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత

Sirivennela Sitarama sastri: అత్యంత విషమంగా సిరివెన్నెల ఆరోగ్యం.. ఐసీయూలో చికిత్స..
Sirivennela
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 30, 2021 | 6:11 PM

Sirivennela Seetharama Sastry Death: టాలీవుడ్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈనెల 24న సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా వైద్యులు తెలిపారు..

ఇక ప్రస్తుతం సిరివెన్నెల ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సిరివెన్నెల వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‏తో బాధపడుతున్నారని తెలిపారు. ఆయన తర్వగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నామని.. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలను తెలియజేస్తామన్నారు. సిరివెన్నెల త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ప్రార్ధిస్తున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమాలో దశాబ్ధాలుగా అద్భుతమైన పాటలను రచించారు సిరివెన్నెల. తన సినీ ప్రస్థానంలో ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించి శ్రోతలను ఆకట్టుకున్నారు. స్వర్ణకమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

Also Read: Keerthi Suresh: కీర్తి సురేష్ న్యూ లుక్స్ అదుర్స్.. .. రవి వర్మ పెయింటింగ్స్‏కు ప్రాణం పోసినట్లున్నాయిగా..

Viral Photo: ఈ బూరెబుగ్గల చిన్నది మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా!

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ను దారుణంగా ట్రోల్‌ చేసిన నెటిజన్‌.. ‘ఎ‍ప్పుడు సచ్చిపోతమో తెలీదంటూ’ క్లాస్‌ పీకిన అఖిల్‌..