Single Movie Review : సింగిల్ మూవీ రివ్యూ.. శ్రీవిష్ణు మళ్లీ హిట్టుకొట్టాడా.. ?
సామజవరగమనా, ఓం భీమ్ బుష్ లాంటి ఎంటర్‌టైన్మెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో శ్రీ విష్ణు. ఈయన తాజాగా నటించిన సినిమా #సింగిల్. గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? మరోసారి శ్రీ విష్ణు హిట్ కొట్టాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: #సింగిల్
నటీనటులు: శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, కేతిక శర్మ, ఇవానా, రాజేంద్ర ప్రసాద్, విటివి గణేష్ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్
కథ, దర్శకుడు: కార్తీక్ రాజు
నిర్మాతలు: విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి, భాను ప్రతాప
సామజవరగమనా, ఓం భీమ్ బుష్ లాంటి ఎంటర్‌టైన్మెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో శ్రీ విష్ణు. ఈయన తాజాగా నటించిన సినిమా #సింగిల్. గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? మరోసారి శ్రీ విష్ణు హిట్ కొట్టాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
విజయ్ (శ్రీ విష్ణు) ఓ బ్యాంక్‌లో పని చేస్తుంటారు.. అతడి స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిషోర్) కూడా అదే బ్యాంకులో పని చేస్తుంటారు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఎంతోమంది అమ్మాయిలను ప్రేమించడానికి ప్రయత్నించినా కూడా వర్కవుట్ అవ్వక సింగిల్స్‌గానే మిగిలిపోతారు ఇద్దరూ. అదే సమయంలో పూర్వ (కేతిక శర్మ)ను చూసి ఇష్టపడతాడు విజయ్. మరోవైపు విజయ్‌ను ప్రేమిస్తుంటుంది హరిణి ( ఇవానా). పూర్వను పడేయడానికి విజయ్ ఏమైతే ప్రయత్నాలు చేస్తుంటాడో.. అవే ప్రయత్నాలు హరిణి కూడా చేస్తుంటుంది. అలా ముగ్గురి కథ సాగుతుంటుంది. మరోవైపు అరవింద్ కూడా గాయత్రి అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఇక విజయ్ తన ప్రేమ విషయం పూర్వకు చెప్తాడు.. మరోవైపు హరిణి కూడా విజయ్‌కు తన ప్రేమ మ్యాటర్ చెప్తుంటుంది. అప్పుడు ఏం జరిగింది..? ఈ ట్రాయాంగిల్ లవ్ గేమ్ ఎలా ఎండ్ అయింది.. అసలింతకీ విజయ్ ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు అనేది అసలు కథ..
కథనం:
కొన్ని సినిమాలకు కథ ఉండదు.. కేవలం కథనం మాత్రమే ఉంటుంది. #సింగిల్ కూడా అలాంటి సినిమానే. కొత్త కథ కావాలి.. ఎమోషన్స్ బాగా పండాలి అనే కాన్సెప్ట్ లేకుండా థియేటర్‌కు ప్లెయిన్ మైండ్‌తో వెళ్తే కడులుపు చెక్కలు చేసే కామెడీ ఇందులో ఉంది. ఎన్ని రోజులైందో ఓ సినిమా చూసి ఇంతలా నవ్వి అంటారు కచ్చితంగా. వన్ లైనర్స్, మీమ్స్, సెటైర్స్.. ఇలా ఒక్కటేంటి అన్నీ ఉన్నాయి #సింగిల్‌లో..! ఒకటి వినేసి నవ్వేలోపు మరో పంచ్ వచ్చేసింది. కథ అస్సలు లేదు.. చాలా సింపుల్.. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. పైగా అందులో ట్విస్టులు కూడా ఉండవు.. చాలా రొటీన్ కథ. కథ పాతదే కానీ స్క్రీన్ ప్లే ఉంటుందబ్బా.. ఏమన్నా రాసుకున్నాడు దర్శకుడు కార్తిక్ రాజు. సీన్‌లో మ్యాటర్ లేకపోయినా డైలాగ్స్‌తోనే నవ్వించేసాడు శ్రీ విష్ణు. హీరోలు, దర్శకులు, సోషల్ మీడియా.. అన్నింటిపై సెటైర్లు వేసారు.. నిర్మాత అల్లు అరవింద్ కూడా తనపైనే సొంత సెటైర్లు వేయించుకున్నాడు.. అలాగే బాలయ్య బ్రాండ్, మహేష్ బాబు ఆయిల్.. ఇలా చాలా ఉన్నాయి లోపల.. దాచేసారంతే. ముఖ్యంగా ఆయన వన్ లైనర్స్ అయితే నెక్ట్స్ లెవల్‌లో పేలాయి.. వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు ఉన్న ప్రతీ సీన్‌లోనూ నవ్వు గ్యారెంటీ.. ఫస్టాఫ్ అంతా హీరో లవ్ ట్రాక్ చుట్టూ తిరుగుతుంది. హీరో ఓ అమ్మాయిని ప్రేమించడం.. హీరోను మరో అమ్మాయి ప్రేమించడం.. ఈ ముగ్గురి చుట్టూ మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు కార్తిక్.. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే కథ కాస్త ఉంది.. కోర్ స్టోరీ రివీల్ చేసాడు. క్లైమాక్స్ అయితే క్రేజీ.. సింగిల్స్ భయంకరంగా కనెక్ట్ అవుతారు. హాయిగా నవ్వుకోడానికి అయితే ఈ సినిమా మంచి ఛాయిస్.
నటీనటులు:
శ్రీ విష్ణు గురించి ఏం చెప్పాలి.. మనోడి బాడీ లాంగ్వేజ్‌తోనే నవ్వొస్తుంది.. ఇక డైలాగ్ డెలవరీ కూడా అదిరిపోయింది. టిపికల్ కామెడీతో నవ్వించాడు. వెన్నెల కిషోర్ ఈ సినిమాకు మరో హీరో.. ఆయన కూడా చాలా సీన్స్ సోలోగా హ్యాండిల్ చేసాడు. ఫస్టాఫ్‌లో రెండు మూడు సీన్స్ అయితే కన్నీళ్ళు వచ్చేవరకు నవ్వించాడు. కేతిక శర్మ, ఇవానా ఇద్దరూ బాగా నటించారు. మిగిలిన వాళ్ళల్ విటివి గణేష్ కామెడీ బాగుంది. రాజేంద్ర ప్రసాద్ కూడా చిన్న పాత్రలో మెప్పించాడు. మిగిలిన వాళ్ళంతా ఓకే..
టెక్నికల్ టీం:
విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు బాగానే ఉన్నాయి.. ఆర్ఆర్ కూడా పర్లేదు. వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ షార్ప్‌గా సెట్ అయింది. ఇక నిర్మాతలు విద్యా కొప్పినీడు, భాను ప్రతాప్, రియాజ్ చౌదరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు కార్తిక్ రాజు కథ సింపుల్‌గానే ఉన్నా.. స్క్రీన్ ప్లే హిలేరియస్‌గా వర్కవుటల్ అయింది. ఆయన కథకు రైటర్ భాను భోగవరపు డైలాగ్స్ బలాన్నిచ్చాయి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా #సింగిల్.. హిలేరియస్.. జస్ట్ గో అండ్ ఎంజాయ్..!