Singer Sunitha-Ram: ‘రామ్ మంచి కాఫీ లాంటి అబ్బాయ్​’.. పెళ్లి రోజున సునీత ఎమోషనల్

ఈ రోజు ప్రముఖ సింగర్ సునీత, రామ్ వీరపనేని పెళ్లి రోజు. ఈ సందర్బంగా సింగర్ సునీత తన భర్త గురించి ఎమోషనల్ అయ్యారు.

Singer Sunitha-Ram: రామ్ మంచి కాఫీ లాంటి అబ్బాయ్​.. పెళ్లి రోజున సునీత ఎమోషనల్
Ram Sunitha

Edited By:

Updated on: Jan 09, 2022 | 7:59 PM

ఈ రోజు ప్రముఖ సింగర్ సునీత, రామ్ వీరపనేని పెళ్లి రోజు. ఈ సందర్బంగా సింగర్ సునీత తన భర్త గురించి ఎమోషనల్ అయ్యారు. తన భర్త రామ్‌ మంచి మనసున్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎన్నో మధురమైన అనుభూతులు అందించిందన్నారు. వెడ్డింగ్ సందర్భంగా తన పెళ్లి వేడుక జ్ఞాపకాలతో పొందుపరిచిన ఓ స్పెషల్‌ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. ఈ వీడియోలో సునీత వాళ్లమ్మ మాట్లాడుతూ.. సునీత.. బరువు బాధ్యతలన్నీ తీర్చుకుంటూ చిరునవ్వు, సహనంతో లైఫ్ లో ముందడుగు వేసిందని పేర్కొన్నారు. ఆమె డేరింగ్‌, అండ్‌ డైనమిక్‌ పర్సనాలిటీ అని.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాక్షించారు. సునీత పిల్లలతో పాటు రామ్ బంధువులు కూడా ఈ జంటపై తమ అభిప్రాయాలను తెలిపారు.

ఇక రామ్‌ గురించి సునీత కీలక విషయాలు వెల్లడించారు.  రామ్‌ ముక్కుసూటి మనిషని, నిజాయితిపరుడని చెప్పారు. సుమారు ఎనిమిదేళ్ల నుంచి తనకు తెలుసని… మంచి కాఫీ లాంటి అబ్బాయ్‌ అని సరాదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు.. సునీత రామ్ లకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

Also Read: Viral Video: సంపులో కరెన్సీ కట్టలు.. నోట్లను ఇస్త్రీ చేసిన అధికారులు.!