
Singer Sunitha Instagram Post: పాటకే అందం తీసుకొచ్చిన సింగర్స్‌లో సునీత ఒకరు. ‘ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు’ అంటూ తన గొంతుతోనే కుర్రకారు హృదయాలను తట్టిలేపిన సింగర్ సునీత ఎన్నో అందమైన పాటలకు ప్రాణం పోసింది.
ఇదిలా ఉంటే సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. శంషాబాద్ సమీపంలోని ఓ ఆలయంలో వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇక వివాహం తర్వాత సోషల్ మీడియాలో బిజీగా మారిన ఈ సూపర్ సింగర్ తాను సంతోషంగా గడపుతోన్న క్షణాలను అభిమానులతో పంచుకుంటోంది. ఇదిలా ఉంటే సంతోషంగా గడుపుతోన్న సునీత తాజాగా ఎంతో బాధ పడుతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనికి కారణం తన గురువు మరణమేనని పోస్ట్ చేసింది. గురువు పెమ్మరాజు మరణించిన నేపథ్యంలో ఆయన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘శ్రీ పెమ్మ రాజు సూర్యారావు గారు .. చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు.. స్వర్గస్థులయ్యారు. చాలా బాధగా ఉంది. ఇలాంటి మహానీయుల్ని కోల్పోతుంటే..’ అంటూ బాధాతప్త హృదయంతో పోస్ట్ చేసింది సునీత.
Also Read: యంగ్ టైగర్ సినిమాలో ‘మన్మధుడు’ ముద్దుగుమ్మ.. ఇన్నాళ్ల తర్వాత త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్..