రాహుల్ సిప్లిగంజ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ సింగర్స్‌లో ఒకరు. ఇటీవల రాహుల్ సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. మాస్ సాంగ్స్ నుంచి లవ్ సాంగ్స్ వరకు మ్యూజిక్ లవర్స్‌కు కనెక్ట్ అయిపోతున్నాయి. మొదట్లో ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ చేస్తూ అదరగొట్టేశాడు. ఇప్పటికే ఎన్నో హిట్ సాంగ్స్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ కావడంతో ప్రైవేట్ ఆల్బమ్స్ పక్కనపెట్టేశాడు. చాలా కాలం తర్వాత రాహుల్ ఇప్పుడు ఊరమాస్ పాటతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. తన సొంత ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పటికే ఎన్నో ఆల్బమ్స్ విడుదల చేసిన రాహుల్.. ఇప్పుడు నీ అయ్యా నా మామ అనే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. తెలంగాణ ఫోక్ పాటకు వెస్ట్రన్ బీట్ జత చేయడంతో అదుర్స్ అనిపిస్తోంది.
ఈ పాటను స్వయంగా రాహుల్ పాడడంతోపాటు నటించి అలరించాడు. ఇక సినిమా పాటలకు ఏమాత్రం తీసిపోకుండా మోడల్స్‌తో ఈ పాటను దుబాయ్ ఎడారిలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ఈ సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఏకంగా మూడున్నర లక్షలకు పైగా వ్యూస్ అందుకుంది. రాహుల్.. ట్రిపుల్ ఆర్ చిత్రంలో పాడిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ క్రేజ్ సైతం ప్రపంచస్థాయికి చేరింది.
#NEEAYYANAAMAMA Always wanted to present Telugu independent music in high standards I think I did well and this is the best what I can do. I hope you guys will like this, thanks for always supporting me always love you all❤️🔥 https://t.co/9rBgN1czrq pic.twitter.com/TO8oamnSUH
— Rahul Sipligunj (@Rahulsipligunj) November 9, 2023
ఇక తాజాగా విడుదలైన ఈ పాటపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ హౌస్ లో తన పాటలతో అలరించిన రాహుల్.. చివరకు సీజన్ 3 విన్నర్ అయ్యారు. కొద్దిరోజులుగా రాహుల్ సింప్లిగంజ్ పేరు నెట్టింట ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో రతికతో ప్రేమాయణం, బ్రేకప్ గురించి నెట్టింట పెద్ద చర్చే జరిగింది. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో గతం, వర్తమానం రెండూ ఉంటాయని.. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదని అన్నారు.
WOWWW check out this latest music video NEE AYYA song of @Rahulsipligunj
It’s HIGH ENERGY ELECTRIC 💐💐💐https://t.co/Udaw9g3nbt
— Ram Gopal Varma (@RGVzoomin) November 10, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.