
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో తన జీవితంలో ఓ కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. తన మనసుకు నచ్చిన హరిణ్యా రెడ్డి అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. ఇటీవలే వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు రాహుల్- హరిణ్య ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరయ్యారు. కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. కాగా ఇప్పుడీ ప్రేమ పక్షులు పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ నెల 27న రాహుల్- హరిణ్యారెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు రాహుల్ తన పెళ్లి శుభలేఖలు తీసుకుని సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లకు వెళుతున్నాడు. తన పెళ్లికి రావాలని కోరుతున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం (నవంబర్ 18) రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిన ప్రత్యేకంగా కలిశారు. తన పెళ్లి శభలేఖను అందజేసి వివాహ వేడుకకు రావాలని కోరాడు. ఇందుకు రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వివాహ వేడుకకు వస్తాను అని టాలీవుడ్ సింగర్ తో చెప్పినట్లు సమాచారం. కాగా రాహుల్ సిప్లిగంజ్ వెంట అతని కాబోయే భార్య హరిణ్యా రెడ్డి కూడా ఉంది.
హరిణ్యా రెడ్డి మరెవరో కాదు లుగుదేశం పార్టీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కుమార్తెనే. రాహుల్ తో ఆమె చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇరు పెద్దల అంగీకారంతో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో మూడు ముళ్ల బంధంతో తమ ప్రేమ బంధాన్ని మరింత ధృఢంగా చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గారు కలిశారు. ఈ నెల 27 న వివాహం చేసుకోబోతున్న రాహుల్ సిప్లిగంజ్ గారు ముఖ్యమంత్రి గారిని కలిసి వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు. @Rahulsipligunj pic.twitter.com/15zqnF7LB3
— Telangana CMO (@TelanganaCMO) November 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.