Saif Alikhan : ఆ ఆటోడ్రైవర్‏ను ఎలా కంటాక్ట్ అవ్వాలో చెప్పండి.. సైఫ్ ఘటనపై సింగర్ సంచలన పోస్ట్..

అర్దరాత్రి తనను ఆసుపత్రిలో చేర్చిన ఆటో డ్రైవర్ ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు సైఫ్ అలీఖాన్. మరోవైపు అతడి మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే మరికొందరు అభిమానులు అతడికి నగదు బహుమతులను అందచేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సింగర్ మికా సింగ్ సంచలన పోస్ట్ చేశారు.

Saif Alikhan : ఆ ఆటోడ్రైవర్‏ను ఎలా కంటాక్ట్ అవ్వాలో చెప్పండి.. సైఫ్ ఘటనపై సింగర్ సంచలన పోస్ట్..
Mika Singh, Saif

Updated on: Jan 22, 2025 | 10:23 PM

బాలీవుడ్ సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్.. ఇప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే సైఫ్ ఎపిసోడ్ మొత్తంలో రియల్ హీరో అయ్యాడు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా. ఇప్పుడు అతడి పేరు మారుమోగుతుంది. జనవరి 16న కత్తిపోట్లకు గురైన సైఫ్ ను అతడు తన ఆటోలో ఆసుపత్రిలో చేర్పించాడు. అప్పుడు నటుడి శరీరమంతా రక్తం కారుతోందని.. అతడు ఎవరు అనేది ఆలోచించకుండా సాయం చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపాడు. కోలుకున్న అనంతరం సైఫ్ ఆ ఆటో డ్రైవర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపాడు.

తాజాగా సైఫ్ ఘటనపై సింగర్ మికా సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ” భారతదేశంలోని సూపర్ స్టార్ నటుడి ప్రాణాన్ని కాపాడినందుకు ఆటో డ్రైవర్ కనీసం 11 లక్షల రూపాయల బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన ధైర్యసాహసాలు నిజంగా అభినందనీయం. వీలైతే దయచేసి వారిని ఎలా సంప్రదించాలో నాతో పంచుకోండి. మెచ్చుకోలుగా అతనికి లక్ష రూపాయలు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను’ అని మికా సింగ్ పోస్ట్ చేశారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

జనవరి 16వ తేదీ తెల్లవారుజామున సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. డబ్బు దోచుకోవడానికి వచ్చిన అతడిని పట్టుకునేందుకు సైఫ్ అలీఖాన్ ప్రయత్నించాడు. ఆ సందర్భంలో సైఫ్ కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్లడం కష్టమైంది. ఆ సమయంలో సైఫ్ ..అతడి కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లాడు భజన్ సింగ్.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..