Singer Chinmayi: ‘జానీ మాస్టర్ భార్య నాకు ఫోన్ చేసి’.. సింగర్ చిన్మయి సంచలన ఆరోపణలు

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది సింగర్ చిన్మయి శ్రీపాద. జానీ మాస్టర్ కు వరుసగా సినిమా అవకాశాలు రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఇప్పుడు మరో సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది.

Singer Chinmayi: జానీ మాస్టర్ భార్య నాకు ఫోన్ చేసి.. సింగర్ చిన్మయి సంచలన ఆరోపణలు
Jani Master, Singer Chinmayi

Updated on: Nov 12, 2025 | 6:09 PM

లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ మాస్టర్. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా కొన్ని రోజులు జైలు శిక్ష కూడా అనుభవించాడీ స్టార్ కొరియోగ్రాఫర్. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ మళ్లీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో అతనికి అవకాశాలు వస్తున్నాయి. దీనిపై సింగర్ చిన్మయి ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ లాంటి వాళ్లకు ఛాన్సులు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు తెలపడమే అవుతుంది’ అంటూ ట్వీట్ చేసింది చిన్మయి. తాజాగా జానీ మాస్టర్ ను ఉద్దేశిస్తూ మరో సంచలన పోస్ట్ పెట్టిందీ స్టార్ సింగర్. ‘జానీ మాస్టర్ కేసు చాలా క్లిష్టమైనది. కొందరు దీన్ని ఇద్దరి సమ్మతితో జరిగిన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మేజర్ అయిన వ్యక్తి మైనర్ బాలికను లోబరుచుకున్నప్పుడు అది కచ్చితంగా మేజర్‌దే తప్పవుతుంది. బాధితురాలు సహకరించనప్పుడు బెదిరించి లొంగదీసుకోవడం దారుణం. ఈ విషయంపై నేను మాట్లాడిన ప్రతిసారి జానీ మాస్టర్ భార్య నాకు ఫోన్ చేస్తుంది. ఈ విషయంపై మాట్లాడవద్దని చెబుతోంది. తన భర్త నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలు ఉన్నాయని ఆమె అంటోంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడి కారణంగా జానీ మాస్టర్ ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు.

‘ఒకవేళ కోర్టు తీర్పు జానీ మాస్టర్ కుఅనుకూలంగా వస్తే, ఇక అతనికి అవార్డుల మీద అవార్డులు వస్తాయి. అతన్ని విమర్శించిన వారే అతని నిర్దోషిత్వం గురించి గొప్పగా మాట్లాడతారు. మైనర్ బాలికలతో శృంగారాన్ని థ్రిల్‌గా భావించే మహానుభావులకు ఈ అంశం మరింత ఉపకరిస్తుంది. పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకొంటారు. జానీ మాస్టర్ ఉదంతంతో మైనర్లను వేధించి ఎలా తప్పించుకోవాలో కచ్చితంగా తెలుస్తుంది. ఏదేమైనా, ఆ బాధితురాలైన అమ్మాయి విజయం సాధించాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. నిందితుడికి శిక్ష పడి, ఆమెకు న్యాయం జరగాలని ఆశిస్తున్నాను’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చింది చిన్మయి.

ఇవి కూడా చదవండి

సింగర్ చిన్మయి ట్వీట్..

ప్రస్తుతం చిన్మయి షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది ఆమెకు సపోర్టుగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు ఇంకా రుజువు కాలేదంటూ చిన్మయికి కౌంటర్లు వేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.