Tillu 2: డీజే టిల్లు వచ్చేశాడు.. ఆకట్టుకుంటున్న టిల్లు 2 ఫస్ట్ సాంగ్ ప్రోమో
నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కథను సిద్దు జొన్నల గడ్డనే రచించారు. ఇక మంచి టాక్ తో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో డీజే టిల్లు సినిమా ఒకటి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కథను సిద్దు జొన్నల గడ్డనే రచించారు. ఇక మంచి టాక్ తో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది. టిల్లు 2 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ చేంజ్ అయ్యింది. ఈ మూవీలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో ఈ మూవీ నుంచి గ్లింమ్స్ ను విడుదల చేశారు. ఆ వీడియో సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి సాంగ్ ప్రోమోను వదిలారు. ఈ పాటకు ముందు వచ్చే చిన్న సన్నివేశాన్ని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అనుపమాను సిద్దూ ఫ్లటింగ్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో చివరిలో “పోయిన సారి అంత అయినా కూడా సిగ్గురాలేదు టిల్లు అన్నకి” అనే డైలాగ్ వస్తుంది.
టికెట్టే కొనకుండా అంటూ సాగే ఈ పాటను రామ్ మిరియాల ఆలరించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను జులై 26న విడుదల చేయనున్నారు. ఇక టిల్లు 2 సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.