Shruti Haasan : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో ముందువరుసలో ఉన్న భామ శృతిహాసన్. ఈ అమ్మడు ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సిద్ధర్థ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఈ సినిమా తర్వాత వరుసగా శృతి చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఆతర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఒక్కసారిగా ఈ అమ్మడు ఫామ్ లోకి వచ్చింది. ఆతర్వాత వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది . దాదాపు టాప్ హీరోలందరి సరసన ఈ చిన్నది ఆడిపాడింది. అందం అభినయంకాలబోసిన ఈ కుర్రది ఇటీవల ‘క్రాక్’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఇదే ‘క్రాక్’ సినిమాతో మాస్ రాజా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కరోనా సమయంలో సినిమా థియేట్సర్స్ కు ప్రేక్షకులు వస్తారా అన్న డౌట్స్ అన్ని క్రాక్ సినిమాతో బ్రేక్ అయిపోయాయి. అటు డిజిటల్ ప్లాట్ఫామ్ పైనా సత్తా చాటుతోందీ అమ్మడు. ఈమె నటించిన`పిట్ట కథలు` వెబ్ సిరీస్ ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ.. రవితేజ పై ఆసక్తికర కామెంట్లు చేసింది. ఆయనలో అహంభావం ఏమాత్రం ఉండదని అందరితోనూ సరదాగా కలిసిపోతుంటారని చెప్పింది. అంతేకాదు.. రవితేజ తనకు చాలా స్పెషల్ అని చెప్పిన శృతి.. తన హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపింది. మాస్ రాజాతో శృతి బలుపు, క్రాక్ సినిమాలు చేసింది. ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :
‘నాకు ఓటీటీలంటే ఇంటరెస్ట్ ఉంది.. త్వరలోనే ఎంట్రీ ఇస్తా’.. క్లారిటీ ఇచ్చిన అక్కినేని యంగ్ హీరో..