అందాల భామ శృతి హాసన్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉంది. బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాలతో దూసుకుపోతోంది శ్రుతి హాసన్. కమల్ హాసన్ బేటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. తన వర్సటైల్ యాక్టింగ్‌తో.. తన యాక్టివిటీతో… తండ్రికి తగ్గ తనయురాలు అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక అంతటితో ఆగకుండా.. ఇప్పుడు ఏకంగా తండ్రిని మించిన తనయురాలు అనే ట్యాక్ వచ్చేలా చేసుకుంటున్నారు. అందరూ స్టన్నయ్యేలా ఇటీవలే ఓ హాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా సైన్ కూడా చేశారు. ఎట్ ప్రజెంట్ ఆ న్యూస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
ఇప్పటికే కోలీవుడ్ , టాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు చేసిన శ్రుతి హాసన్.. ఇప్పుడు ‘ది ఐ’ అనే హాలీవుడ్ సినిమాను చేస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్రీస్లో జరుగుతోంది. ఇక డాఫ్నే ష్మోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎమిలీ కార్ల్టన్ స్క్రీన్ ప్లేని అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే శృతి హాసన్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. శ్రుతి హాసన్ ఒక హీరోకు అప్పుడు లవర్ గా నటించి ఇప్పుడు వదినగా నటించనుంది. ఆ హీరో ఎవరో తెలుసా.. మాస్ మహారాజ రవితేజ. రవితేజ నటించిన బలుపు, క్రాక్ సినిమాల్లో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఈ ఇద్దరు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో శ్రుతి మెగాస్టార్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ ,మాస్ రాజా బ్రదర్స్ గా కనిపించనున్నారని టాక్. అన్న తమ్ముడి మధ్య జరిగే కథతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే శ్రుతి ఈ సినిమాలో రవితేజకు వదిన అవుతుంది. ఇలా ఒక హీరోకు ప్రేయసిగా మరోసారి అదే హీరోకు వదిన నటించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో శ్రుతి కూడా జాయిన్ అయ్యింది.