ఒకప్పుడు హీరోయిన్ల రేంజ్‌ను సక్సెస్… పెర్ఫామెన్స్‌లను బట్టి అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ బ్యూటీ స్టార్ పవర్ అయినా సోషల్ మీడియా నెంబర్స్ మీదే డెపెండ్ అవుతోంది. ఈ విషయంలో అందరికంటే ముందున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. రీసెంట్ హిట్‌లో గ్లామర్ షోతో రెచ్చిన పోయిన శ్రద్దా సోషల్ మీడియాలోనూ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్.. కెరీర్ ఎర్లీ డేస్ నుంచి తన ఓన్ ఐడెంటిటీ కోసం కష్టపడుతున్నారు. గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అన్న సిగ్నల్స్ ఇస్తూనే… పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాలతో అలరిస్తున్నారు. దీంతో నేషనల్ లెవల్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిపోయారు ఈ బ్యూటీ.
ఆషిఖీ 2 సినిమాతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన శ్రద్దా కపూర్.. ఆ తరువాత సాహో సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్నారు. తాజాగా తూ ఝూటీ మై మక్కర్ సినిమాలో చేసిన గ్లామర్ షోతో బీటౌన్ గ్లామర్ దివాగా మారిపోయారు. ఆ క్రేజ్ సోషల్ మీడియాలోనూ రిఫ్లెక్ట్ అవుతోంది. సోషల్ మీడియా పవర్ హౌస్‌గా మారిపోయారు ఈ హాట్ బ్యూటీ. ప్రజెంట్ శ్రద్ధా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కు 79.3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు 7 కోట్ల 93 లక్షల మంది ఈ బ్యూటీని ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు. శ్రద్ధా కంటే ముందు ఒక్క ప్రియాంక చోప్రా మాత్రమే ఈ లిస్ట్‌లో ఉన్నారు. హాలీవుడ్లోనూ సినిమాలు చేస్తున్న ప్రియాంకకు ఆ స్థాయి ఫాలోయింగ్ ఉండటం పెద్ద విషయమేం కాదు.. కానీ ఇండియన్ స్టార్ మాత్రమే అయిన శ్రద్ధాకు హాలీవుడ్ రేంజ్ ఫాలోయింగ్ రావటం అన్నది నిజంగానే గ్రేట్ అచ్చీవ్‌మెంట్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
ప్రజెంట్ బాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆలియా భట్, దీపికా పడుకోన్ లాంటి టాప్ హీరోయిన్స్‌కు కూడా ఫాలోయింగ్ విషయంలో శ్రద్ధా తో పోటి పడలేకపోతున్నారు. రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండటం.. తన హాలీడే మూమెంట్స్‌తో పాటు సినిమా అప్‌డేట్స్.. ఫోటో షూట్స్‌ను రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోవటం వల్లే శ్రద్ధాకు సోషల్ మీడియాలో ఈ రేంజ్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యిందని అంచనా వేస్తున్నారు.