Ram Charan : పాతబస్తీలో సందడి చేయనున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

మన్యం దొర అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్ళింది ఈ మూవీ.

Ram Charan : పాతబస్తీలో సందడి చేయనున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్
Ram Charan

Updated on: Feb 06, 2023 | 7:47 AM

ఆర్ఆర్ఆర్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. మన్యం దొర అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్ళింది ఈ మూవీ. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ లో చోటు దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు చరణ్ మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. స్టార్ డైరెక్షన్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని పాతబస్తీలో చేయనున్నారట. హైదరాబాద్లోని పాతబస్తీలో ఓ పాటను షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ ఇండస్ట్రీలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటించనుండని టాక్ వినిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర చరణ్ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర సెకండాఫ్ లో కీలక పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.