‘మాస్ అంటే బస్సు పాస్ అనుకుంటివా.. ఎవడు పడితే వాడు వాడేసుకోడానికి.. అది మన బలుపు బట్టి.. బాడీ లాంగ్వేజ్‌ను బట్టి జనాలు ఇచ్చే బిరుదు’.. ఓ సినిమాలో రవితేజ చెప్పే డైలాగ్ ఇది. నిజంగా మాస్ అంటే ప్రజంట్ తెలుగునాట గుర్తొచ్చేది హీరో రవితేజానే. క్లాప్ అసిస్టెంట్ దగ్గర్నుంచి మొదలెట్టి.. స్టార్ హీరోగా ఎదిగారు రవి శంకర్ రాజు అలియాస్ రవితేజ. ఈయన బొమ్మ రిలీజ్ అవుతుంది అంటే.. ఆ జోష్ వేరు. ఆయన అభిమానుల హంగామా వేరు. ఏడాదికి 2,3 సినిమాలు చేస్తున్న ఏకైక స్టార్ హీరో రవితేజ. ఇకపోతే.. చిరంజీవి హీరోగా వస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో కీ రోల్‌లో నటించాడు రవితేజ. దాదాపు 40 నిమిషాల పాటు ఈ క్యారెక్టర్ ఉంటుందట. చిరు, రవితేజ.. ఇద్దరు సెల్ప్ మేడ్ స్టార్స్ నటించిన ఈ మూవీ జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను పలకరించబోతుంది.
అయితే ఈ మూవీ కోసం రవితేజ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. రూ.17 కోట్లని డిమాండ్ చేయగా.. ప్రొడ్యూసర్స్ 16 కోట్లకు డీల్ ఓకే చేశారట. 40 నిమిషాల పాత్రకు ఇంత పారితోషకం అంటే.. రవితేజ రేంజ్ ఏంటే అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మాస్ రాజా తన సినిమాలకు 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. కానీ ఈ సినిమా కోసం తన డేట్‌లను సర్దుబాటు చేసి, ఈ ప్రత్యేక పాత్ర కోసం తగినంత సమయాన్ని వెచ్చించినందుకు ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం.
కాగా రవితేజ అప్పుడప్పుడే నిలదొక్కుంటున్న సమయంలో.. చిరంజీవితో కలిసి 2000లో వచ్చిన ‘అన్నయ్య’ సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ 22 ఏళ్లకి ఇద్దరూ ఒకేసారి స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఇక రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రం ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. మిక్స్‌డ్ టాక్ వచ్చిన్పటికీ.. 5 రోజుల్లోనే ఈ మూవీ సుమారు రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట చేసినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..