ఒకే మూవీలో రాజ‌శేఖ‌ర్ డాట‌ర్స్..!

టాలీవుడ్ స్టార్ సెలిబ్రిటీ క‌పుల్ రాజశేఖ‌ర్, జీవితల కుమార్తెలు శివానీ, శివాత్మిక ఒకే సినిమాలో క‌నిపించేందుకు క‌స‌ర‌త్త‌లు సిద్ద‌మైన‌ట్టు తెలుస్తోంది.

ఒకే మూవీలో రాజ‌శేఖ‌ర్ డాట‌ర్స్..!

Updated on: Jun 07, 2020 | 3:24 PM

టాలీవుడ్ స్టార్ సెలిబ్రిటీ క‌పుల్ రాజశేఖ‌ర్, జీవితల కుమార్తెలు శివానీ, శివాత్మిక ఒకే సినిమాలో క‌నిపించేందుకు క‌స‌ర‌త్త‌లు సిద్ద‌మైన‌ట్టు తెలుస్తోంది. శివానీ ‘2 స్టేట్స్’ అనే మూవీ ద్వారా అడ‌వి శేష్‌తో క‌లిసి వెండితెర ఎంట్రీ ఇవ్వాల‌ని భావించిన‌ప్ప‌టికీ..ఆ చిత్రం అనూహ్యంగా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. త్వ‌ర‌లో తేజ స‌జ్జా లీడ్ రోల్ లో మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ లో శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇక శివాత్మిక ‘దొర‌సాని’ చిత్రంతో వెండితెరకు ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జంట్ ఈమె ‘రంగ‌మార్తాండ’ మూవీ చేస్తుంది.

కాగా శివానీ, శివాత్మిక‌లు ఒకే మూవీలో క‌నిపించ‌నున్నార‌ని ఫిల్మ్ స‌ర్కిల్ లో ప్రచారం జ‌రుగుతోంది. ప్ర‌వీణ్ స‌త్తారు త్వ‌ర‌లో క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కించ‌నుండ‌గా, ఇందులో ఇద్ద‌రు అక్కాచెల్లెల్లు ఒకే ఫ్రేమంలో క‌నిపిస్తార‌ని స‌మాచారం. జీవిత ప్రొడ్యూస్ చేయ‌నున్న‌ ఈ చిత్రానికి సంబంధించి త్వ‌ర‌లో అధికారిక‌ ప్ర‌క‌ట‌న రానుంది.