Puneeth Rajkumar: తమ్ముడి చివరి సినిమాకు డబ్బింగ్ చెప్తూ కన్నీళ్లు పెట్టున్న శివన్న..

|

Jan 30, 2022 | 10:32 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. పునీత్ అకాల మరణం సౌత్ ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది

Puneeth Rajkumar: తమ్ముడి చివరి సినిమాకు డబ్బింగ్ చెప్తూ కన్నీళ్లు పెట్టున్న శివన్న..
Puneeth
Follow us on

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ అకాల మరణం సౌత్ ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది. చిన్న వయసులోనే పునీత్ కన్నుమూయడం అందరిచేత కన్నీరు పెట్టించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. పవర్ స్టార్ గా కన్నడ నట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పునీత్. అనేక సేవ కార్యక్రమాలతో సూపర్ స్టార్ గా నిలిచారు. పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar) చివరగా యువరత్న సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఆయన చనిపోయే సమయానికి జేమ్స్(James) అనే సినిమా చేస్తున్నారు. అలాగే ‘ద్విత్వ’ అనే మరో  సినిమాలో నటిస్తున్నారు. వీటిలో జేమ్స్ సినిమా పునీత్ చనిపోయే నాటికే పూర్తయ్యింది కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలిఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో పునీత్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. మార్చి లో ఆయన జయంతి సందర్భంగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

అయితే ఈ సినిమాలో పునీత్ పాత్రకు ఆయన అన్న శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు. పునీత్ మరణం కంటే ముందే షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ డబ్బింగ్ మాత్రం జరగలేదు. దాంతో ముందుగా మిమిక్రీ ఆర్టిస్ట్ లతో ట్రై చేశారు. కానీ అది కుదరలేదు. చివరకు ఆయన అన్న శివ రాజ్ కుమార్ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ చెబుతున్న సమయంలో శివ రాజ్ కుమార్ పలుసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారని తెలుస్తుంది. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని తాను భావించలేదని శివ రాజ్ కుమార్ అక్కడే కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే ఓ ఇంటర్వ్యూలో శివన్న మాట్లాడుతూ.. పునీత్ ను అలా చూస్తూ డబ్బింగ్ చెప్పడం చాలా కష్టంగా అనిపించింది. పలు సందర్బాల్లో ఎమోషనల్ అయ్యాను అని చేప్పారు శివన్న. పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఆ సమయంలో మరో సినిమా రిలీజ్ కాకుండా కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?

Bhama Kalapam: భామా కలాపం ట్రైలర్ లాంచ్ రేపే.. హాజరుకానున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ..

Athulya Ravi: అందంతో అదరగొడుతున్న ‘అతుల్య రవి’.. ముగ్ధులవుతున్న కుర్రకారు.. (ఫొటోస్)