AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreekaram Trailer: భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఇప్పుడు ఈ ‘శ్రీకారం’ చుట్టాల్సిందే.. రైతే రాజు

విభిన్న సినిమాలను ఎంచుకునే హీరోలలో యంగ్ హీరో శర్వానంద్ ఒకరు. ప్రేమ, కుటుంబం, సున్నితమైన భావోద్వేగాలు, అప్పుడప్పుడు కాస్త యాక్షన్.. ఈ కాన్సెప్ట్‌లతోనే

Sreekaram Trailer: భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఇప్పుడు ఈ 'శ్రీకారం' చుట్టాల్సిందే.. రైతే రాజు
Rajitha Chanti
|

Updated on: Mar 05, 2021 | 10:30 PM

Share

విభిన్న సినిమాలను ఎంచుకునే హీరోలలో యంగ్ హీరో శర్వానంద్ ఒకరు. ప్రేమ, కుటుంబం, సున్నితమైన భావోద్వేగాలు, అప్పుడప్పుడు కాస్త యాక్షన్.. ఈ కాన్సెప్ట్‌లతోనే సినిమాలను చేయడం శర్వానంద్ స్పెషాలిటీ. ఇక ఇదే ఫార్ములతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరేట్ హీరోగా మారిపోయాడు.  ప్రస్తుతం శర్వానంద్.. కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం శ్రీకారం. ఈ సినిమాలో ప్రియాంక్ అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదైలన ఈ మూవీ పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి. మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు కానుకగా.. ఈ మూవీ ట్రైలర్ ను యంగ్ హీరోస్ నితిన్, నాని, వరుణ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇందులో శర్వానంద్ పాత్రలో ఆకట్టుకుంటున్నారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. ఈసారి శర్వానంద్ మరోసారి హిట్ట్ కోట్టేలా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఇందులోని రావు రమేష్, వీకే నరేష్ లాంటి సీనియర్ నటుల ఎమోషన్స్ హైలేట్ అని చెప్పుకోవచ్చు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకొని రైతుగా మారిన హీరో‌ వ్యవసాయం చేయడానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే సాయి కుమార్ ఇందులో నెగిటివ్ రోల్ చూపించారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కి చే మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ఈనెల శివరాత్రి సందర్బంగా 11న విడుదల చేయనున్నారు. ఇందులో రావు రమేష్, నరేష్, మురళీ శర్మ, సాయి కుమార్, ఆమని, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్న ఈ ట్రైలర్‌ని మీరూ చూసేయండి..

Also Read:

Vadinamma Serial Actress Sujitha: ‘వదినమ్మ’ ఫేం సుజీత (సీత) గురించి ఆసక్తికర విషయాలు… అందమైన ఫోటోలు..

బిగ్‏బాస్ విన్నర్ ఇంట్లో తీవ్ర విషాదం.. అస్వస్థతతో తండ్రి అకాల మరణం.. భావోద్వేగ పోస్ట్..

A1 Express Movie Review: గమ్యాన్ని చేరుకున్న ‘A1 ఎక్స్‏ప్రెస్’.. హాకీ ప్లేయర్‏గా మెప్పించిన సందీప్ కిషన్..