Shankar And LYCA Issue : తమిళ డైరెక్టర్ శంకర్‌కు మద్రాస్ హై కోర్టులో ఊరట లభించింది. కమల్ హాసన్ హీరోగా ఇండియన్ -2 సినిమా నిర్మిస్తున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంకర్‌పై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. అతడు ఈ సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమాకు దర్శకత్వం వహించొద్దని స్టే వేసింది. అయితే దీనిపై విచారణ చేసిన మద్రాస్ హై కోర్టు అది కుదరదని స్పష్టం చేసింది.కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమాను ప్రాథమికంగా రూ.236 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించామని తెలిపిన లైకా ప్రొడక్షన్స్.. ఇప్పటి వరకు రూ.180 కోట్లు ఖర్చు పెట్టినట్లు పిటిషన్‌లో పేర్కొంది.
డైరెక్టర్‌కు రూ.40 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఒప్పుకున్నామని, అందులో రూ.14 కోట్లు కూడా ఇచ్చేశామని తెలిపారు. అయితే ఇప్పుడు తమ సినిమాకు కాకుండా మరో సినిమాకు దర్శకత్వం ప్రారంభించబోతున్నారని, అందుకు అనుమతించరాదని కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు..మరో సినిమాకు శంకర్ డైరెక్షన్ చేయడంపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. కెరీర్‌లో తొలిసారి తెలుగు హీరోతో సినిమా చేయబోతున్నాడు శంకర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఈయన పాన్ ఇండియన్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు.
పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండబోతుందనే వార్తలు వచ్చాయి. ఒకే ఒక్కడు సినిమాకు ఇది సీక్వెల్ అని కూడా ప్రచారం జరుగుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ జోలికి పోకుండా కేవలం కథా ప్రధానంగా సాగేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు శంకర్. అయితే గతంలో ఇండియన్ -2 సినిమా షూటింగ్ మధ్యలో ఘోర ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారు. ఈ సినిమా కోసం లైకా ప్రొడక్షన్స్ భారీగానే ఖర్చు చేసింది. అయితే ఉన్నపలంగా ఈ సినిమాను ఆపేశాడు శంకర్. గతంలో శంకర్ ఇదే నిర్మాణంలో రోబో 2.0 సినిమా చేశాడు. అయితే ఇది దారుణంగా ఫ్లాప్ అయింది. దాంతో ఇండియన్ 2 సినిమాకు సగానికి సగం బడ్జెట్ కోత పెట్టారు నిర్మాతలు.