Shanmukh Jaswanth Update: ఇటీవల డ్రంకన్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. షణ్ముక్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌కు హాజరు కావాలంటూ నోటిసులు ఇచ్చారు. అయితే పోలీసులు ఇచ్చిన ఆదేశాలను షణ్ముక్ జస్వంత్ పట్టించుకోకుండా.. కౌన్సిలింగ్‌కు హాజరు కాలేదని తెలుస్తోంది. దీనితో జస్వంత్‌పై కోర్టు ప్రొసీడింగ్స్‌కు జూబ్లి హిల్స్ పోలీసులు సిద్దమవుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, షణ్ముఖ్ జస్వంత్ ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అటు ‘సూర్య’ అనే మరో వెబ్ సిరీస్‌ను షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సిరీస్‌లు కోట్లలో వ్యూస్ రాబడుతున్నాయి.
కాగా, హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10లో యూట్యూబ్ ఫేమ్, టిక్‌టాక్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ తప్పతాగి రెండు కార్లు, రెండు బైక్‌లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. షణ్ముఖ్ జశ్వంత్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా.. 170 రీడింగ్ వచ్చింది. ఐపీసీ సెక్షన్ 337, 279 కింద పోలీసులు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసిన విషయం విదితమే.
Also Read:
ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!
మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతోన్న బంగారం ధరలు.. 2 నెలల్లో ఎంత తగ్గిందంటే.!
Viral: భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు లేఖ.. నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్.!