Adipurush Controversy: ‘ఆదిపురుష్ టీమ్‏ను కాల్చేయాలి’.. శక్తిమాన్ నటుడు షాకింగ్ కామెంట్స్..

|

Jun 21, 2023 | 3:31 PM

రామాయణాన్ని తెరకెక్కించామని దర్శకుడు చెబుతుండగా.. మేము అసలు రామాయణాన్ని రూపొందించలేదు.. హనుమంతుడు అసలు దేవుడే కాదు.. కేవలం భక్తుడు మాత్రమే మనమే ఆయనను దేవుడిని చేశామంటూ సంచలన కామెంట్స్ చేసి మరోసారి చిక్కుల్లో పడ్డారు రైటర్ మనోజ్ ముంతాషిర్. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు ముఖేష్ కన్నా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదిపురుష్ చిత్రయూనిట్ మొత్తాన్ని కాల్చేయాలని అన్నారు.

Adipurush Controversy: ఆదిపురుష్ టీమ్‏ను కాల్చేయాలి.. శక్తిమాన్ నటుడు షాకింగ్ కామెంట్స్..
Mukesh Khanna
Follow us on

ఆదిపురుష్ సినిమాపై వివాదాలు ఆగడం లేదు. రామాయణాన్ని అపహాస్యం చేస్తూ డైరెక్టర్ ఓంరౌత్ ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించాడని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ సినిమాలోని రాముడు, హనుమ, రావణ పాత్రల కాస్ట్యూమ్స్, వారు చెప్పే డైలాగ్స్ విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులే కాదు.. సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు చిత్రయూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ నిరసనలు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ మూవీ టీం తమను తాము సమర్దించుకుంటున్నారు. రామాయణాన్ని తెరకెక్కించామని దర్శకుడు చెబుతుండగా.. మేము అసలు రామాయణాన్ని రూపొందించలేదు.. హనుమంతుడు అసలు దేవుడే కాదు.. కేవలం భక్తుడు మాత్రమే మనమే ఆయనను దేవుడిని చేశామంటూ సంచలన కామెంట్స్ చేసి మరోసారి చిక్కుల్లో పడ్డారు రైటర్ మనోజ్ ముంతాషిర్. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు ముఖేష్ కన్నా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదిపురుష్ చిత్రయూనిట్ మొత్తాన్ని కాల్చేయాలని అన్నారు.

ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “రామాయణానికి ఆదిపురుష్ సినిమాను మించిన అవమానం మరొకటి ఉండదు. ఓంరౌత్ కు అసలు రామాయణం గురించి అవగాహన ఏమాత్రం లేదు. ఇక మన రామాయణాన్ని కలియుగంగా మార్చిన మేధో రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా.. అతని అర్థంలేని డైలాగ్స్.. నిద్రపుచ్చే స్క్రీన్ ప్లే.. అన్ని కలిసి ఈ సినిమాను రూపొందించాయి. ఇలాంటి చెత్త డైలాగ్స్ రాసిన వారిని.. ఈ సినిమాను తెరకెక్కించివారిని ఎప్పటికీ క్షమించకూడదు. ఇక ఈ సినిమాలో హనుమంతుడి లుక్ చూస్తే.. ఓ పర్వతాన్ని ఎత్తి మేకర్స్ పై పడేస్తాడు.

ఇవి కూడా చదవండి

రామాయణాన్ని అపహాస్యం చేసి.. ఇంకా తమను తాము సమర్ధించుకుంటున్నారు. ఈ చిత్రబృందం మొత్తాన్ని 50 డిగ్రీల సెల్సియస్ వద్ద నిలబెట్టి తగలబెట్టాలి. విమర్శలు వస్తుంటే వారు మౌనంగా ఉండిపోతారు అనుకున్నాను. కానీ ఇంకా వివరణ ఇస్తున్నారు. సనాతన ధర్మం కోసం చేస్తున్నామని చెబుతున్నారు. కానీ రామాయణాన్ని పూర్తిగా మార్చేశారు ” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.