Jawan Movie : ఆ దేశంలో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా నిషేధం.. కారణం ఇదే

అన్ని చోట్ల నుంచి జవాన్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. సౌత్ డైరెక్టర్ అట్లీ మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. జవాన్ సినిమాతో బాలీవుడ్ మొత్తం షేక్ అయ్యింది. సెప్టెంబర్ 7 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. తొలి రోజే వరల్డ్ వైడ్ గా జవాన్ సినిమా 150 కోట్ల వరకు రాబట్టింది ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సినిమాను అట్లీ తెరకెక్కించిన విధానం, షారుఖ్ నటన సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.

Jawan Movie : ఆ దేశంలో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా నిషేధం.. కారణం ఇదే
Jawan

Updated on: Sep 08, 2023 | 9:22 AM

జవాన్ ఇప్పుడు ఎక్కడ చుసిన ఈ సినిమా సందడే కనిపిస్తుంది. ఎవరి నోట విన్న జవాన్ సినిమా మాటే. పఠాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న షారుక్ ఖాన్ ఇప్పుడు జవాన్ సినిమాతో ఆ సినిమా రికార్డ్ ను తుడిచేశాడు. అన్ని చోట్ల నుంచి జవాన్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. సౌత్ డైరెక్టర్ అట్లీ మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. జవాన్ సినిమాతో బాలీవుడ్ మొత్తం షేక్ అయ్యింది. సెప్టెంబర్ 7 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. తొలి రోజే వరల్డ్ వైడ్ గా జవాన్ సినిమా 150 కోట్ల వరకు రాబట్టింది ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సినిమాను అట్లీ తెరకెక్కించిన విధానం, షారుఖ్ నటన సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.

ఇదిలా ఉంటే జవాన్ సినిమాను ఓ దేశం లో మాత్రం బ్యాన్ చేశారు. జవాన్ సినిమా రిలీజ్ ను ఆపేశారు. దాంతో షారుఖ్ ఫ్యాన్స్ అంతా సినిమా కోసం నిరసన చేస్తున్నారు. ఇంతకు ఏ దేశంలో అంటే. జవాన్ సినిమాను బంగ్లాదేశ్ లో నిషేధించారు. జవాన్ సినిమాను మాత్రమే కాదు గతంలో పఠాన్ సినిమా కూడా అదే రోజు బంగ్లా లో రిలీజ్ కాలేదు. ఆతర్వాత రిలీజ్ చేశారు.

ఇక జవాన్ సినిమా రిలీజ్ కాకపోవడానికి కారణం కూడా ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉదృక్త పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ప్రభుత్వం పై ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజలు ఆగ్రహించడంతో బంగ్లాదేశ్‌లో యుద్ద వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించారు. దాంతో జవాన్ విడుదలను బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డ్ నిషేధించింది. దాంతో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సినిమాను వెంటనే రిలీజ్ చేయాలని కోరుతూ రోడ్లపై నిరసన చేస్తున్నారు. మరి త్వరలోనే జవాన్ సినిమాను బంగ్లాదేశ్ లో రిలీజ్ చేస్తారేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.