అచ్చొచ్చిన లుంగీ సెంటిమెంట్..మహేశ్ ఖాతాలో మరో బ్లాక్‌బాస్టర్

|

Jan 12, 2020 | 10:56 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్‌లో అగ్రకథానాయకుడు. వివాదరహితుడు కూడా. మహేశ్ సినిమా హిట్ అన్న పేరొస్తే అప్పటివరకు ఉన్న రికార్డులు గల్లంతవ్వడం ఖాయం. ఇక సెంటిమెంట్స్‌కు బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు సూపర్‌స్టార్. తన సినిమా ముహుర్తపు సన్నివేశాలకు హాజరుకాడు. ఇక మూడు అక్షరాలతో వచ్చిన టైటిల్స్ ఎక్కువ హిట్ అవ్వడంతో..అలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇక తన మూవీకి చెందిన ప్రతి అంశాన్ని తనకు అచ్చొచ్చిన ‘9’  నెంబర్‌తో ముడిపడేలా చూసుకుంటాడు. వీటితో పాటు […]

అచ్చొచ్చిన లుంగీ సెంటిమెంట్..మహేశ్ ఖాతాలో మరో బ్లాక్‌బాస్టర్
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్‌లో అగ్రకథానాయకుడు. వివాదరహితుడు కూడా. మహేశ్ సినిమా హిట్ అన్న పేరొస్తే అప్పటివరకు ఉన్న రికార్డులు గల్లంతవ్వడం ఖాయం. ఇక సెంటిమెంట్స్‌కు బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు సూపర్‌స్టార్. తన సినిమా ముహుర్తపు సన్నివేశాలకు హాజరుకాడు. ఇక మూడు అక్షరాలతో వచ్చిన టైటిల్స్ ఎక్కువ హిట్ అవ్వడంతో..అలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇక తన మూవీకి చెందిన ప్రతి అంశాన్ని తనకు అచ్చొచ్చిన ‘9’  నెంబర్‌తో ముడిపడేలా చూసుకుంటాడు. వీటితో పాటు మహేశ్‌కు మరో క్రేజీ సెంటిమెంట్‌ కూడా ఉంది. ఆయన లుంగీలో కన్పించిన సినిమాలు బ్లాక్‌బాస్టర్ హిట్స్‌గా నిలిచాయి.  పోకిరి, శ్రీమంతుడు, భరత్ అనే నేను..ఈ మూడు సినిమాల్లో లుంగీతో కనిపించాడు. ఊహించని విధంగా ఈ మూడు కూడా మహేశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. ఒక్కసారి మహేశ్ పంచెగానీ, లుంగీగానీ కట్టుకోని అలా నడిచొస్తుంటే, థియేటర్స్‌లో ఫ్యాన్స్‌ను ఆపడం ఎవ్వరితరం కాదు.

ఇక తాజాగా సరిలేరు నీకెవ్వరు మూవీలో కూడా మహేశ్ లుంగీతో కనిపించి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. మైండ్ బ్లాక్‌ సాంగ్‌తో పాటు చాలా సీన్స్‌లో మహేశ్ లుంగీతో రచ్చ చేశాడు. ఊహించని విధంగా ఈ మూవీ కూడా నేడు(జనవరి11) రిలీజై హిట్ టాక్‌తో దుమ్ము రేపుతోంది. థియేటర్స్‌ దగ్గర ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ప్లాప్ అంటూ ఎరుగని అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, క్యూట్ రష్మిక మందనా మహేశ్ జోడిగా ఆడిపాడింది.