RGV On Talibans: ఇప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఆఫ్గనిస్థాన్‌లో జరుగుతోన్న పరిమాణాలపై చర్చించుకుంటున్నారు. అమెరికా సైన్యాలు ఆఫ్గన్‌ను వీడడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇక ఆఫ్గన్ ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటున్నారు. దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాబూల్ నగరంలోని ఇంటర్‌నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి విదేశాలకు వెళుతోన్న విమానాల రెక్కలపై వేలాడుతూ వెళుతోన్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్నాయి. ఇదిలా ఉంటే సుమారు 20 ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న తాలిబన్లు మళ్లీ అధ్యక్ష పీఠాన్ని అస్తగతం చేసుకోవడంతో రచ్చ చేస్తున్నారు. అధ్యక్ష భవనంతో పాటు దేశ వ్యాప్తంగా హంగామా సృష్టిస్తున్నారు.
U can see what kind of animals the taliban are just by how they are eating food in the Presidential palace pic.twitter.com/lSXb9uyhsJ
— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2021
ఇదిలా ఉంటే సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందించే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తాలిబన్ల వ్యవహార శైలిపై కూడా స్పందించారు. తాలిబన్లు అధ్యక్ష భవనంలో చేతిలో ఆయుధాలు పట్టుకొని జాల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించన వీడియోని షేర్ చేస్తూ.. ‘వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతుందని’ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇక కాబూల్‌లోని ఓ ఎమ్యూజ్‌మెంట్ పార్కుకి వెళ్లిన తాలిబన్లు అక్కడ ఎలక్ట్రిక్ కార్లలో కూర్చొని చిన్న పిల్లలా ఆడుతూ, కేరింతలు కొడుతోన్న వీడియోను షేర్ చేస్తూ.. ‘ఇది నిజం.. తాలీబన్స్ చిన్న పిల్లలు’ అంటూ తనదైన శైలిలో స్పందించారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Finally the truth ..The Taliban are just kids ? https://t.co/j8Y5itNo6Y
— Ram Gopal Varma (@RGVzoomin) August 17, 2021
Also Read: Taliban on Kashmir: కశ్మీర్‌పై క్లారిటీ ఇచ్చిన తాలిబన్లు.. అయినా భద్రతపై ఫోకస్ పెట్టిన కేంద్రం
Black Fungus Effect: బ్లాక్ ఫంగస్ భయంతో దంపతుల ఆత్మహత్య.. అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు దాచి మరీ..