Actress Radhika: మూడు రోజులుగా ఆస్పత్రిలోనే నటి రాధిక.. ఫొటోస్ వైరల్.. ఏమైందంటే?

ప్ర‌ముఖ న‌టి రాధిక శ‌ర‌త్ కుమార్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ తో ఆడియెన్స్ ను మెప్పిస్తున్నారు. అయితే ఇప్పుడీ సీనియర్ నటి ఉన్నట్లుండి ఆస్పత్రి పాలయ్యారు.

Actress Radhika: మూడు రోజులుగా ఆస్పత్రిలోనే నటి రాధిక.. ఫొటోస్ వైరల్.. ఏమైందంటే?
Actress Radhika

Updated on: Jul 31, 2025 | 9:50 PM

ప్ర‌ముఖ న‌టి రాధిక శ‌ర‌త్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. జులై 28న ఆమెను చెన్నైలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేర్పించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో వైద్యులు రాధిక కు ట్రీట్ మెంట్
అందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. మొదట ఇది సాధారణ జ్వరమని భావించినా, వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్టు నిర్ధారణ అయ్యిందట. అందుకే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నా, పూర్తి కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. కాగా రాధిక ఆస్పత్రి పాలయ్యారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త వెలువడగానే సినీ ప్రముఖులు, అభిమానులు, ఆందోళన చెందారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో #GetWellSoonRaadhika అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.

 

ఇవి కూడా చదవండి

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి వందలాది సినిమాల్లో నటించింది రాధిక. ముఖ్యంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి 16 సినిమాల్లో నటించారామె. కేవలం నటిగానే మాత్రమే కాకుండానిర్మాతగా కూడా పలు విజయాలు అందుకున్నారు రాధిక.  పలు టీవీ సీరియల్స్,  సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే క్రియాశీల రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారీ అందాల తార. ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో నటిస్తోన్న రాధిక కొన్ని టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ లోనూ సందడి చేస్తున్నారు.

భర్త  శరత్ కుమార్ తో నటి రాధిక..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి