
దక్షిణాది సినీపరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఊర్వశి ఒకరు. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో హీరోయిన్ గా అనేక చిత్రాల్లో నటించింది. అప్పట్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమె.. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. సహజ నటనతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్న ఊర్వశి.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆమె కూతురు తేజలక్ష్మి సైతం సినిమాల్లోకి అరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యింది. 1983లో తమిళంలో సూపర్ హిట్ అయిన ముందనై ముడిచ్చు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది ఊర్వశి. ఆ తర్వాత వివిధ భాషలలో నటించింది. 2000లో నటుడు మనోజ్ కె జయన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి తేజలక్ష్మి అనే కూతురు జన్మించింది. కొన్నాళ్లకు ఇద్దరు మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఊర్వశి శివప్రకాష్ ను వివాహం చేసుకోగా.. మనోజ్ ఆశాను వివాహం చేసుకున్నారు.
కొన్నాళ్లుగా వీరిద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఊర్వశి కూతురు తేజలక్ష్మి సైతం సినిమాల్లోకి అడుగుపెట్టనుంది. మలయాళి చిత్రం సుందరియాయవల్ స్టెల్లా సినిమాతో ఆమె వెండితెరపై సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. అలాగే తన కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన నటుడు మనోజ్ కూతురిని పరిచయం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
తన కూతురు తేజలక్ష్మీ మొదట నటించాలనే కోరికను తన భార్య ఆశతో చెప్పిందని.. ఆ తర్వాత తన తల్లి ఊర్వశితో చెప్పి ఆమె ఆశీస్సులు తీసుకోవాలని తన భార్య సూచిందని అన్నారు. అందుకే తన కూతురితోపాటు తాను సైతం చెన్నై వెళ్లి ఊర్వశిని కలిశానని అన్నారు. తేజలక్ష్మీ కథానాయికగా నటిస్తున్న సుందరియాయవల్ స్టెల్లా సినిమాలో సర్జానో ఖలీద్ హీరోగా నటిస్తున్నారు. డెమోంటి కాలనీ 2 సినిమాతోపాటు మరికొన్ని చిత్రాల్లో నటించారు సర్జానో.
ఇవి కూడా చదవండి :
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..
Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..