
సీనియర్ నటుడు చంద్రమోహనం మరణం సినీ ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టింది. ఆయన మరణ వార్త విని సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1000 సినిమాల్లో నటించి మెప్పించారు చంద్రమోహన్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన నిన్న ( శనివారం రోజున) తుది శ్వస విడిచారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతూ చంద్రమోహన్ కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రమోహన్ మరణ వార్త నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. నిన్ననే ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు(55) కన్నుమూశారు.
నిర్మాత మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించారు యక్కలి రవీంద్ర బాబు.ఆయనకు భార్య రమా దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రవీంద్ర బాబు. శనివారం రోజు కన్నుమూశారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో రవీంద్ర బాబు 17 సినిమాలను నిర్మించారు. ఆయన మృతికి సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇప్పుడు మరో విషాదం నెలకొంది ప్రముఖ కోలీవుడ్ సీనియర్ హీరో కన్నుమూశారు. సినీ నటుడు గంగా (53) శుక్రవారం రోజున గుండెపోటుతో మృతి చెందారు. హీరోగా ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఉయిరుళ్లవరై ఉషా సినిమాతో పరిచయమైనా గంగ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. కొంతకాలం హీరోగా రాణించిన గంగా ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేసి మెప్పించారు. ఆయనకు పెళ్లి పై ఆసక్తి లేదు. తనతో బ్రహ్మచారి గానే జీవితాన్ని సాగించారు. గంగ మృతితో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుమునుకున్నాయి. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.