కెప్టెన్ విజయ్‌కాంత్.. 1980-90ల మధ్యకాలంలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈ నటుడు. పోలీస్ పాత్రలకు పర్పెక్టుగా సూటయ్యే ఈ హీరో తెలుగు, తమిళ్ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించాడు. 1979లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన సుమారు మూడు దశాబ్దాల పాటు నటుడిగా ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా తన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ ఘన విజయం సాధించిన తర్వాత నుంచి కెప్టెన్‌గా ఇండస్ట్రీలో పాపులరైపోయారు. ఈయన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి ఘన విజయం సాధించాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వెళ్లిన విజయ్‌కాంత్ డీఎండీకే పార్టీ స్థాపించారు. 2006, 2011 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. ఇదిలా ఉంటే విజయ్‌కాంత్ గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో తో బాధపడుతున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి కారణంగా ఆయన బాగా బక్కచిక్కిపోయారు. ఈ కారణంగానే గత ఏడాది వైద్యులు ఆయన కాలికి మూడు వేళ్లను తొలగించారు. కాగా మంగళవారం(జనవరి 30) నటుడు విజయ్ కాంత్– ప్రేమలతల పెళ్లిరోజు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు విజయ్‌కాంత్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఈనేపథ్యంలో ప్రముఖ సీనియర్ దర్శకుడు, విజయ్ దళపతి తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ విజయ్‌కాంత్‌ను కలిశారు. కెప్టెన్ ఇంటికెళ్లిన ఆయన విజయ్‌కాంత్‌తో కాసేపు గడిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. 1971లో విజయకాంత్ హీరోగానే చట్టం ఒరు ఇరుట్టరై చిత్రం ద్వారా ఎస్‌ఏ చంద్రశేఖర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. . వీరి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఈక్రమంలోనే విజయ్‌కాంత్‌ను కలిశారు చంద్రశేఖర్. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంత బాగానే ఉన్నా నడవలేని స్థితిలో వీల్‌చైర్‌కే పరిమితమైన విజయ్‌కాంత్‌ను చూసి ఫ్యాన్స్ తల్లడిల్లిపోతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
January 31st
Wishing Our Captain @iVijaykanth Sir And #Premalatha Madam,
A Very Happy 33 Wedding Anniversary.#Vijayakanth #CaptainVijayakanth #PremalathaVijayakanth #Premalatha #DMDK#WeddingAnniversary@lksudhish @MpAnand_PRO@idiamondbabu @esakkimuthuk @RIAZtheboss pic.twitter.com/e0Kuj65ni0— Actor Kayal Devaraj (@kayaldevaraj) January 30, 2023
#SAChandrasekhar #Vijayakanth Recent Clicks ??❤️ pic.twitter.com/dIuonEJPcB
— Trend Soon (@trend_soon) January 31, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.