NTR 30: ఎన్టీఆర్30 కీలక పాత్రలో సీనియర్ హీరో.. తారక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రీకాంత్

ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ.. అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జాన్వీ నటిస్తోన్న తొలి తెలుగు సినిమా ఇది.

NTR 30: ఎన్టీఆర్30 కీలక పాత్రలో సీనియర్ హీరో.. తారక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రీకాంత్
Ntr 30
Follow us

|

Updated on: Mar 24, 2023 | 5:24 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఎన్టీఆర్ క్రేజ్ ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా మారుమ్రోగింది. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ.. అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జాన్వీ నటిస్తోన్న తొలి తెలుగు సినిమా ఇది. ఇక ఈ సినిమా కోసం కొరటాల ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారు. ఇటీవల జరిగిన పూజాకార్యక్రమంలో కొరటాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో మనుషుల కంటే మృగాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. దేనికి భయపడని మృగాలు ఎవరికీ భయపడతాయో మీకు తెలుసు అని అన్నారు.

దాంతో ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్ధమవుతోంది. అయితే ఈ సినిమాలో చాలా స్టార్ కాస్ట్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో హీరో శ్రీకాంత్ నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ 30 గురించి క్లారిటీ ఇచ్చారు.

అఖండ సినిమానుంచి నా కెరీర్ టర్న్ అయ్యింది. చాలా సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. తారక్ తో కలిసి నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను. తారక్ నన్ను బాబాయ్ అని పిలుస్తుంటాడు. తనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు శ్రీకాంత్. అలాగే మూడు వెబ్ సిరీస్ లలో నటించానని ఆయన అన్నారు.