మా అధ్యక్ష ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్‌బాబు. తనను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, కానీ సంయమనం పాటిస్తున్నానని అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నింటికి సమాధానం చెబుతానని, తాను అసమర్థుడిని కాదని చెప్పారు. సింహం నాలుగు అడుగులు వెనక్కు వెస్తే భయపడినట్లు కాదని.. అది గురి చూసి పంజా విసురుతుందని అన్నారు. మాలో ఏం జరుగుతుందో అందరు గమనిస్తున్నారని అన్నారు.
నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. ఓటు ఎటు వేసినా ఇది అందరి ఓటు అని.. ఇది అందరి విజయమని మోహన్ బాబు స్పష్టం చేశారు. పలువురిపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలను కలిసి విజ్ఞప్తి చేస్తే వాళ్లు సాయం చేస్తారని అన్నారు.
భవిష్యత్తును దృష్టిలోఉంచుకుని నడుచుకుంటానని విష్ణు తెలిపారు. నాగబాబు రాజీనామా ఆమోదించమని, నాగబాబు ఆవేశంతో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రమాణస్వీకారంపై రేపు క్లారిటీ ఇస్తానని పేర్కొన్నారు. చిరంజీవి తనను తప్పుకొమ్మన్నారని తెలిపారు. రాం చరణ్ నాకు మంచి మిత్రుడని చెప్పారు. నాన్ తెలుగు ఫ్యాక్టర్ తను నమ్మనని చెప్పిన విష్ణు రాంచరణ్ ఓటు ప్రకాష్ రాజ్‌కే వెళ్లిందని చెప్పారు.
Read Also.. MAA Elections 2021: మా ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చేశాయి.. కొత్త కార్యవర్గం ఇదే..