AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలాంటివి జరిగితే నాలోని రాములమ్మ బయటకు వస్తుంది.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్

ఇప్పటివరకు సుమారు 180కు పైగా సినిమాల్లో నటించారు విజయశాంతి. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నటించి లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న విజయశాంతి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చారు.

అలాంటివి జరిగితే నాలోని రాములమ్మ బయటకు వస్తుంది.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్
Vijaya Shanthi
Rajeev Rayala
|

Updated on: Jan 15, 2026 | 10:48 AM

Share

హీరోయిన్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు విజయశాంతి. హీరోయిన్ గా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు విజయశాంతి. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో మెప్పించారు. అలాగే హీరోలకు సమానంగా యాక్షన్ సీన్స్ లో అరదరగొట్టారు విజయశాంతి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ యాక్షన్ హీరోయిన్.. ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తున్నారు. మొన్నామధ్య మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ నటించిన సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమాలో నటించారు. కాగా గతంలో విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఈ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో ఒక మహిళకు తనదైన గుర్తింపు, హీరో ఇమేజ్‌ను తెచ్చుకోవడం ఎంత కష్టమో ఆమె తెలిపారు.. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్‌లో, యాక్షన్ జానర్‌లో హీరోలతో సమానంగా నిలబడడం ఒక పెద్ద సవాలని ఆమె అన్నారు. యాక్షన్ సన్నివేశాలలో సహజత్వం, బాడీ లాంగ్వేజ్‌లో రఫ్‌ అండ్ టఫ్‌ స్వభావం, అందం, ఎక్స్‌ప్రెషన్స్ సమపాళ్లలో చూపించడానికి తాను ఎంత కష్టపడ్డానో విజయశాంతి తెలిపారు. హీరోలు పడే కష్టం చూసి మొదట్లో బాధపడేదానినని, ఆ తర్వాత తానూ అదే పంథాలోకి మారడానికి సమయం పట్టిందని ఆమె అన్నారు. గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో 20, 30 అడుగులు దూకడం, డూప్ లేకుండా ఫైట్స్ చేయడం వంటి సాహసాలు చేసి, ది బెస్ట్ అనే పేరు తెచ్చుకున్నానని ఆమె అన్నారు.

ప్రతిఘటన సినిమా సందర్భాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. తను డేట్స్ కుదరక ఆ సినిమా చేయలేనని చెప్పినప్పుడు, నువ్వు చేయకపోతే నేను చేయను అని టీ. కృష్ణ పట్టుబట్టారని, చివరికి ప్రొడ్యూసర్లు అందరూ మరీ మరీ కోరగా , వైజాగ్ వెళ్లి ఒక నెలలో షూటింగ్ పూర్తి చేశానని చెప్పారువిజయశాంతి. చిన్న వయసులో లెక్చరర్ పాత్రకు తను సరిపోదని విమర్శలు వచ్చినప్పుడు, టీ. కృష్ణ తనపై నమ్మకం ఉంచారని, తాను ఆ విమర్శలను ఛాలెంజ్‌గా తీసుకుని అద్భుతంగా నటించానని, ఆ సినిమా తన కెరీర్‌కు సూపర్ స్టార్ అనే మలుపును ఇచ్చిందని విజయశాంతి అన్నారు. అలాగే  సినిమాలకు అతీతంగా, విజయశాంతి మహిళల హక్కుల కోసం తన పోరాటాన్ని కొనసాగించారు. “నా పని, నా డ్యూటీ, నా ఇల్లు అనే తన ప్రపంచం ఉన్నప్పటికీ, ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని తెలిస్తే, “రాములమ్మ” బయటికి వస్తుందని ఆమె అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.