Vijayashanti : మరో సినిమా ఒకే చేసిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి.. 21ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్

సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Vijayashanti : మరో సినిమా ఒకే చేసిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి.. 21ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్
Vijayashanthi

Updated on: Feb 20, 2021 | 6:51 PM

Actress Vijayashanthi  : సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు విజయశాంతి హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కమర్షల్ సినిమాలే కాదు.. మనలో దేశభక్తి నింపే సినిమాలు కూడా తీయగలదు. లా 1999లో విజయశాంతి ఆర్మీ ఆఫిసర్‌గా విజయశాంతి నటించిన సినిమా భారత రత్న. అయితే అప్పుడా సినిమాను నిర్మించిన ప్రతిమా ఫిల్మ్ ఇప్పుడు ఇన్నిసంవత్సరాల తర్వాత సీక్వెల్ ను  తీసుకురావడానికి ట్రై చేస్తోంది.

అందుకోసం ఓ పవర్‌ ఫుల్ సబ్జెక్ట్‌ను కూడా సిద్ధం చేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దేశభక్తి నేపథ్యంలో స్ట్రాంగ్‌ పాయింట్‌తో ఈ కథ ఉంటుందట. భారత రత్న 2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి విజయశాంతి అయితేనే బాగుంటుందని ఆ చిత్ర యూనిట్ ఫిక్స్‌ అయిందట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు విజయశాంతి ఓకే చెప్పినట్టు ఫిలిం సర్కిల్స్ లో టాక్‌ వినిపిస్తోంది. ఈ కథ తన ఇమేజ్‌కు సరిగ్గా సరిపోతుందని, ఈ సినిమా చేయాలని విజయశాంతి అనుకుంటున్నారట. ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తిగా కశ్మీర్‌లోనే జరగనుందట. సినిమాకు సంబంధించిన రి అప్‌డేట్స్ త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: ఏనుగుపై నగ్నంగా పోజులు.. జనాలు తిట్ల దండకం.. క్షణాల్లో వీడియో డిలీట్.!

 

Follow Us