Actress Simran : హీరోయిన్ సిమ్రాన్ గుర్తుందా ?.. మనాలి అందాల దారుల్లో ఏం చేస్తుందో చూశారా ?.. వీడియో వైరల్..

1976లో ముంబైలో రిషిబాలా నావల్‌లో జన్మించిన సిమ్రాన్, 1995లో హిందీ చిత్రాలలో అడుగుపెట్టింది. ఆమె 1977లో తన రెండవ చిత్రం తేరే మేరే సప్నేతో గుర్తింపు తెచ్చుకుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిమ్రాన్.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సనమ్ హార్ జాయే అనే హిందీ సినిమాతె వెండితెరకు పరిచయమైంది. 1997లో విడుదలైన నేరుక్కు నెర్ సినిమా తమిళంలో ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది. ఆ తర్వాత మలయాళంలో ఇంద్రప్రస్థం సినిమాతో సౌత్ లోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించింది.

Actress Simran : హీరోయిన్ సిమ్రాన్ గుర్తుందా ?.. మనాలి అందాల దారుల్లో ఏం చేస్తుందో చూశారా ?.. వీడియో వైరల్..
Simran
Follow us

|

Updated on: Feb 10, 2024 | 7:38 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ సిమ్రాన్. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు ఇలా స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. సిమ్రాన్‏కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. సౌత్ టూ నార్త్ లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. 1976లో ముంబైలో రిషిబాలా నావల్‌లో జన్మించిన సిమ్రాన్, 1995లో హిందీ చిత్రాలలో అడుగుపెట్టింది. ఆమె 1977లో తన రెండవ చిత్రం తేరే మేరే సప్నేతో గుర్తింపు తెచ్చుకుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిమ్రాన్.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సనమ్ హార్ జాయే అనే హిందీ సినిమాతె వెండితెరకు పరిచయమైంది. 1997లో విడుదలైన నేరుక్కు నెర్ సినిమా తమిళంలో ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది. ఆ తర్వాత మలయాళంలో ఇంద్రప్రస్థం సినిమాతో సౌత్ లోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించింది. అప్పట్లో ఆమెను లేడీ సూపర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునేవాళ్లు ఫ్యాన్స్. కానీ పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. నెమ్మదిగా ఒకట్రెండు మూవీస్ చేసిన ఆమె.. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇప్పుడు కేవలం తన ఫ్యామిలీకి పూర్తి సమయాన్ని కేటాయించింది. ఈ క్రమంలోనే తాజాగా వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంది.

ప్రస్తుతం సిమ్రాన్ మనాలీ వెకేషన్ లో ఉంది. ఒంటరిగా మనాలిలో ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మనాలీలోని మంచు దారుల్లో సరదాగా కారు డ్రైవింగ్ చేస్తూ కనిపించింది. ఇండియాలో అద్భుతమైన మదర్ నేచర్ ఉందని.. దండం పెట్టాల్సిందే అన్నట్లుగా సిమ్రాన్ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో సిమ్రాన్ చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ విషయాలను, ఫోటోలను పంచుకుంటుంది. అలాగే గతంలో తన భర్త , కుమారులతో కలిసి సరదాగా గడిపిన వెకేషన్ ఫోటోస్ షేర్ చేసింది. సిమ్రాన్ చివరిగా సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3లో నస్రీన్ ఇరానీ పాత్రను పోషించింది. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సినీ ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను సంపాదించింది. కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ, కుముద్ మిశ్రా, రణ్‌వీర్ షోరే తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ