‘F3’ సినిమా నుంచి మరో అప్ డేట్.. మరోసారి ఆ సీనియర్ హీరోయిన్‏కు ఛాన్స్ ఇవ్వనున్న డైరెక్టర్..

|

May 26, 2021 | 6:19 AM

F3 Movie Update: విక్టరీ వెంకటేష్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం F3. ఈ సినిమా 2019లో సూపర్ హిట్

F3 సినిమా నుంచి మరో అప్ డేట్.. మరోసారి ఆ సీనియర్ హీరోయిన్‏కు ఛాన్స్ ఇవ్వనున్న డైరెక్టర్..
F3 Movie
Follow us on

F3 Movie Update: విక్టరీ వెంకటేష్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం F3. ఈ సినిమా 2019లో సూపర్ హిట్ అందుకున్న ఎఫ్ 2 చిత్రానికి సిక్వెల్ తెరకెక్కిస్తున్నా్రు డైరెక్టర్ అనిల్. ఇందులో.. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ కు కరోనా బ్రేక్ వేసింది. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

అనిల్ రావిపూడి.. మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాత చాలా కాలం తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సీనియర్ నటి సంగీత. ఈ సినిమాలో సంగీత కామెడీ టైమింగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా మరోసారి తన సినిమాలోకి సంగీత తీసుకునే ప్లాన్ చేస్తున్నారట అనిల్. ఇటీవల జరిగిన షూటింగ్ లో సంగీత జరగాల్సిన షాట్స్ నిలిచిపోయాయట. అయితే ఇప్పుడు వాటిని మైసూర్ షెడ్యూల్ లో పూర్తిచేయాలని చూస్తున్నారట. ఈ సినిమాలో కూడా సంగీత కోసం కామికల్ రోల్ నే డిజైన్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఎఫ్ 3 సినిమా.. ఈ ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ప్రస్తుతం ఈ సినిమా పనులు ఆగిపోయాయి. దీంతో ముందు అనుకున్న సమయానికి ఎఫ్ 3 చిత్రం విడుదల కావడం  లేదంటూ టాక్ వినిపిస్తోంది.  ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్నారు.

Also Read: పాన్ ఇండియా నుంచి గ్లోబల్ స్టార్‏గా మారనున్న ప్రభాస్.. హాలీవుడ్ సినిమాలో రెబల్ స్టార్.. విడుదల ఎప్పుడంటే..

Family Man 2: ముదురుతున్న వెబ్ సిరీస్ వివాదం.. ఫ్యామిలీ మ్యాన్2 పై సీరియస్ అయిన తమిళనాడు ప్రభుత్వం..

Kishan Reddy Coments : ఈటల ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ.. హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి ఏం చెప్పారంటే..?

LPG Cylinders : గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్..! ఇక నుంచి కిరాణా షాపుల్లో, పెట్రోల్‌ బంకుల్లో ఎల్పీజీ సిలిండర్లు..