
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో, డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఆయన కేవలం తెరపైనే కాకుండా, నిజజీవితంలోనూ ఎంతో పరిణితితో ప్రవర్తిస్తారనేది సినీ పెద్దలు తరచూ చెప్పే మాట. తాజాగా, ఒక పాత ఇంటర్వ్యూలో సీనియర్ నటి రమాప్రభ, జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం గురించి పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రమాప్రభ ఒక ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, ఒక సినిమా ఫంక్షన్ సమయంలో జరిగిన సంఘటనను ప్రస్తావించారు. ఆ వేడుక జరుగుతున్న సమయంలోనే బయట ఒక అభిమాని ప్రమాదవశాత్తు చనిపోయాడనే వార్త ఎన్టీఆర్ చెవిన పడింది. సాధారణంగా ఆ వయసులో ఉన్న ఎవరైనా సరే, అలాంటి వార్త వినగానే ఒక్కసారిగా కంగారుపడటం లేదా ఎలా స్పందించాలో తెలియక తత్తరపాటుకు గురికావడం సహజం. కానీ, ఎన్టీఆర్ ఆ వార్తను విన్నప్పుడు ఆయన ముఖంలో కనిపించిన స్పందన, ఆ వేదన రమాప్రభను ఎంతగానో కదిలించింది. ఆ చిన్న వయసులోనే ఆయనలో కనిపించిన మెచ్యూరిటీ అసమానమైనదని ఆమె ప్రశంసలు కురిపించారు.
ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..
ఆ ఫంక్షన్ ముగిసిన తర్వాత, మైక్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఉన్న అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించదని అన్నారు. ఒక చిన్న పిల్లోడిలా కాకుండా, ఒక బాధ్యతాయుతమైన కుటుంబ పెద్దగా, ఒక తండ్రి స్థానంలో నిలబడి ఆయన మాట్లాడారని ఆమె పేర్కొన్నారు.”ఎవరూ అధైర్యపడకండి, గొడవలు చేయకండి, ప్రశాంతంగా ఉండండి” అంటూ అభిమానులను, వారి కుటుంబాలను ఉద్దేశించి ఆయన ఇచ్చిన ధైర్యం ఆ వయసు పిల్లల మాటల్లో వచ్చేది కాదని రమాప్రభ స్పష్టం చేశారు . ఈ విధమైన ఆత్మవిశ్వాసం, ఇంతటి గంభీరత ఎన్టీఆర్‌కు ఎక్కడి నుంచి వచ్చాయనే దానికి రమాప్రభ ఒక చక్కని విశ్లేషణ ఇచ్చారు .
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
అది ఆయనకు పుట్టుకతోనే వచ్చిన సంస్కారమని, పెద్దల ఆశీస్సులు, ప్రకృతి ఇచ్చిన వరమని ఆమె అభిప్రాయపడ్డారు. సంస్కారం ఉన్నవారికే ప్రకృతి అలాంటి పరిణితిని ఇస్తుందని అన్నారు. ఎన్టీఆర్ లో ఆ సంస్కారం ఉంది కాబట్టే, ఆయన అంతటి ఉన్నత స్థానంలో నిలబడ్డారని రమాప్రభ అన్న మాటలు ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..