
తెలుగు సినీ పరిశ్రమలో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ రాధ. 80, 90’sలలో దక్షిణాదిలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఇక ఆ తర్వాత ఆమె కూతురు కార్తీక నాయర్ 2009లో జోష్ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీలో కార్తీక తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి అలరించింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాలు కార్తీకకు గుర్తింపు తీసుకువచ్చాయి. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఆ తర్వాత 2011లో దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన గో చిత్రంతో తమిళంలోకి అడుగుపెట్టింది. అయితే అందం, అభినయంతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కార్తీకకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపారరంగంలో బిజీ అయ్యింది.
ఇదిలా ఉంటే.. కార్తీక గతేడాది నవంబర్ లో తన బాయ్ ఫ్రెండ్ రోహిత్ మీనన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహ వేడుకకు సౌత్ ఇండస్ట్రీలోని సీనియర్ నటీనటులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక తాజాగా తన కూతురు కార్తీక ప్రమోషన్ పొందింది అంటూ గుడ్ న్యూస్ పంచుకున్నారు సీనియర్ హీరోయిన్ రాధ.. పెళ్లైన రెండు నెలలకే తన కూతురికి ప్రమోషన్ వచ్చిందంటూ ఇన్ స్టాలో షేర్ చేశారు.
“నా కుమార్తెను కొత్తగా పెళ్లయిన మహిళగా చూడడం ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. ఇక ఇప్పుడు ఈ కొత్త కోడలు కుటుంబానికి పెద్ద కోడలుగా ప్రమోషన్‌ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు నా కూతురు పెద్ద కోడలు అయ్యింది. తమ ఇంట్లోకి మరో కొత్త కోడలు వచ్చింది.. వారికి అభినందనలు” అంటూ రాసుకొచ్చింది రాధ. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. కార్తీకకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.