సౌందర్య, మీనా వల్లే ఈ హీరోయిన్ పెళ్లి.. ఆ రోజు అలా జరగకపోయిఉంటే..

సినీ సెలబ్రెటీల ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్స్, విడాకులు అనేవి చాలా కామన్ గా వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి. సెలబ్రెటీలు ఎవరు.. ఎప్పుడు విడిపోతారో చెప్పడం కష్టమైపోతుంది. చాలా మంది యంగ్ హీరోయిన్స్ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్నారు. విడాకులు అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు.

సౌందర్య, మీనా వల్లే ఈ హీరోయిన్ పెళ్లి.. ఆ రోజు అలా జరగకపోయిఉంటే..
Tollywood

Updated on: Nov 11, 2025 | 11:51 AM

చాలా మంది సినీ సెలెబ్రెటీలు తమ కో స్టార్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటారు. ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్స్ ను పెళ్లి చేసుకున్నారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ డైరెక్టర్స్‌ను పెళ్లి చేసుకున్నారు. సినిమా షూటింగ్ స్పాట్ లో ప్రేమలో పడ్డ హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా షూటింగ్ లో దర్శకుడి పై మనసు పడింది. అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆమె ప్రేమకథలో ఊహించని ట్వీట్స్ లు కూడా ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కారణంగానే ఆమె పెళ్లి జరిగిందట. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా రాణించిన ఆ ఇద్దరు భామలు చేసిన ఓ పని వల్ల తన పెళ్లి జరిగిందని గతంలో ఆమె చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరంటే..

ఒకప్పుడు రాణించిన ముద్దుగుమ్మల్లో ఖుష్బూ ఒకరు. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఖుష్బూ. వెంకటేష్ హీరోగా నటించిన కలియుగపాండవులు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు ఖుష్బూ. `కెప్టెన్ నాగార్జున`, `త్రిమూర్తులు`, `భరతంలో అర్జునుడు`, `కిరాయి దాదా`, `జీవన జ్యోతి`, `శాంతి క్రాంతి`, `పేకాట పాపారావు` ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు ఆమె. ఆతర్వాత చిరంజీవి స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా కనిపించారు. అలాగే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ తల్లి పాత్రలో కనిపించారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు పలు సినిమాలు చేస్తూనే.. కొన్ని టీవీ షోలోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే రాజకీయాల్లోనూ ఖుష్బూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు ఈ సీనియర్ హీరోయిన్. గతంలో ఓ టాక్ షోలో ఆమె తన ప్రేమ విషయాలను బయటపెట్టింది. తన భర్త సుందర్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడో తేలింది ఖుష్బూ. ఈ స్టార్ హీరోయిన్ భర్త సుందర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆతర్వాత `మురై మామన్‌` మూవీతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సౌందర్యను అనుకున్నారట. ఆమెతో సినిమా చేయాలనీ అనుకున్నాడట సుందర్. అయితే ఆమె అప్పటికే స్టార్ హీరోయిన్ కావడంతో ఆమె సినిమాలో నటిస్తుందో లేదో అని వెనక్కి తగ్గాడట. ఆతర్వాత మీనాను అనుకున్నారట. కానీ ఆమె డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంతో మూడో ఛాయిస్ గా ఖుష్బూని ఎంపిక చేశారట. అయితే ఈ సినిమా సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే సుందర్ కు, ఖుష్బూకి మధ్య కెమెరామెన్‌ మీడియాటర్ గా ఉండేవాడట.. అయితే అది చూసి చాలా మంది. కెమెరామెన్‌తో ఖుష్బూ లవ్‌లో ఉందని అనుకున్నారట. ఓ రోజు సుందర్ వచ్చి.. మనం పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు నీలా ఉంటారా? నాలా ఉంటారా అన్నాడట. దాంతో ఆమె షాక్ అయ్యిందట. దాంతో మరో మాట మాట్లాడకుండా వెంటనే ఎస్ చెప్పిందట ఖుష్బూ.. ఒక వేళ సౌందర్యకాని మీనా కానీ ఆ సినిమా చేసి ఉంటే ఖుష్బూ లైఫ్ లో సుందర్ ఉండేవాడు కాదు అని అంటున్నారు కొందరు నెటిజన్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి