నా భర్తను చంపి శవాన్ని రోడ్డుమీద పడేశారు..! వామ్మో ఈ నటి జీవితంలో ఇంత విషాదం జరిగిందా..!

నటి కృష్ణవేణి తన జీవిత ప్రయాణం, దర్శకుడు రాజచంద్రతో వివాహం, ఆయన మరణం చుట్టూ ఉన్న రహస్యాలపై ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. సావిత్రి జీవితంతో తనను పోల్చడంపై స్పందిస్తూ, రాజచంద్ర అకాల మరణం తన జీవితాన్ని ఎలా మార్చివేసిందో వివరించారు. సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు.

నా భర్తను చంపి శవాన్ని రోడ్డుమీద పడేశారు..! వామ్మో ఈ నటి జీవితంలో ఇంత విషాదం జరిగిందా..!
Actress Krishnaveni

Updated on: Aug 28, 2026 | 7:30 PM

సీనియర్ నటి కృష్ణవేణి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ పరిశ్రమలో తన ప్రయాణం, దివంగత దర్శకుడు రాజచంద్రతో తన వివాహం, ఆయన మరణం వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలను పంచుకున్నారు. తన జీవితాన్ని మహానటి సావిత్రి జీవితంతో పోల్చడంపై ఆమె స్పందిస్తూ, క్లైమాక్స్ తప్ప మిగతాదంతా తన జీవితం ఆమె జీవితాన్ని పోలి ఉంటుందని అన్నారు. కృష్ణవేణి దర్శకుడు రాజచంద్రను వివాహం చేసుకున్నారు. ఆయనకు అంతకుముందే వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజచంద్ర సినీ పరిశ్రమలో అనేక కష్టాలు పడి పైకి వచ్చారని, ఒక సినిమాకు 25,000 రూపాయల నుంచి రెండు, మూడు లక్షల రూపాయలు తీసుకునే స్థాయికి ఎదిగారని ఆమె గుర్తుచేసుకున్నారు. వారాలబ్బాయి, మొండిఘటం, బొమ్మరిల్లు, మా ఊరిలో మహాశివుడు, కుటుంబ గౌరవం వంటి 15కి పైగా విజయవంతమైన చిత్రాలను ఐదేళ్ల వ్యవధిలో రాజచంద్ర అందించారని, ఆయన సినిమాలు 100 రోజులు, 300 రోజులు కూడా ఆడాయని కృష్ణవేణి వివరించారు.

ఆయన లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు.. నన్ను స్టార్ హీరోయిన్‌ను చేశారు

అయితే, వారి వైవాహిక జీవితం కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. రాజచంద్ర మరణంపై కృష్ణవేణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం ప్రమాదం కాదని, అది హత్య అని ఆమె ఖరాఖండిగా చెప్పారు. మరణించిన రోజు రాజచంద్ర తన ఇంట్లో భోజనం చేసి వెళ్లారని, రాత్రి ఏం జరిగిందో ఎవరికీ తెలియదని ఆమె అన్నారు. ఆయన మృతదేహాన్ని రోడ్డుపై పడేశారని, తన ఇంటి ఎదురుగా పోలీసులు చూపిన గొలుసు, చెప్పులు, కళ్ళజోడు ఆయనవేనని తెలిసినప్పుడు మాత్రమే తనకు ఆ సంఘటన నమ్మకమనిపించిందని తెలిపారు.

మహేష్‌తో ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.! రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

కృష్ణవేణి మాటల్లోనే, రాజచంద్రను “కరెంటు వైర్లు పెట్టి కాల్చి, పీక నొక్కి చంపితే ఎలా ఉంటుందో ఆయన ఒంటి మీద అన్నీ చూశాను” అని ఆమె వివరించారు. ఈ హత్య వెనుక సినీ పరిశ్రమలోని “పెద్ద తిమింగలాలు” ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. నాటి కమిషనర్ దేవారాం తనకు అండగా నిలిచారని, “నీకు ఏం కావాలి? నీ పిల్లకు ఏం కావాలి? నీకు ఏమైనా సెక్యూరిటీ కావాలా?” అని అడిగి సహాయం అందించారని తెలిపారు. తనను, తన కుటుంబాన్ని కూడా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని, రెండు సంవత్సరాల పాటు పోలీసుల కాపలాలో ఉన్నామని ఆమె వెల్లడించారు. ఈ విషయంలో ఒక హీరోయిన్ పాత్ర ఉందని, ఆమె కుళ్ళిపోయి మరణించిందని కూడా కృష్ణవేణి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

చిరంజీవి ఇష్టమైన బాలయ్య సినిమా ఎదో తెలుసా.? ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ అది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us