ఆ హీరో అంటే పిచ్చి.. పెళ్లి చేసుకోవాలనుకున్నా..! సీనియర్ నటి కవిత కామెంట్స్
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు నటి కవిత. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించారు. అలాగే హీరోయిన్ గానూ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. అలాగే హీరో, హీరోయిన్స్ కు తల్లిగా నటించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తెలుగు సినిమాల్లో వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి కవిత. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. ఒకప్పుడు బిజీగా సినిమాలు చేసిన కవిత ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించారు. నటి కవిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తన సినిమా ప్రస్థానాన్ని, ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ పై తనకున్న అపారమైన అభిమానాన్ని పంచుకున్నారు. చిన్నతనంలోనే కృష్ణ గారిని చూసినప్పుడు, ఆయన లాంటి భర్త రావాలని కలలు కనేదాన్ని అని తెలిపారు. తనను తాను కృష్ణ గారికి పిచ్చి అభిమానిగా చెప్పుకొచ్చారు కవిత. ఈ అభిమానం గురించి విజయనిర్మల గారు తెలుసుకుని, కృష్ణ గారితో హీరోయిన్‌గా నటించే అవకాశం కల్పించారని కవిత తెలిపారు.
కృష్ణ గారితో నటించేటప్పుడు, తన అభిమానం, గౌరవం వల్ల తాను బిగుసుకుపోయేదాన్ని, ఇతర హీరోలతో నటించినంత స్వేచ్ఛగా ఉండేదాన్నికాదని ఆమె అన్నారు. విజయనిర్మల తనను కపిత అని సరదాగా పిలిచేవారని, దానికి అర్థం కోతి లేదా అల్లరి అని కవిత అన్నారు. కృష్ణ గారు మితభాషి అయినప్పటికీ, గొప్ప మానవతావాది అని, అద్భుతమైన వ్యక్తి అని కవిత అన్నారు. ఆయన నేను తనకు పెద్ద అభిమాని అని చెప్పినా.. కేవలం అవునా అని మాత్రమే అని చిరునవ్వు నవ్వేవారని కవిత అన్నారు.
దర్శకుడు కె. రాఘవేంద్ర రావు సినిమాలలో హీరోయిన్‌గా నటించలేకపోవడం, దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో ప్రేమాభిషేకం ఒక్క సినిమాలోనే నటించడం తన కెరీర్‌లో ఉన్న నిరాశల్లో ఒకటని కవిత పేర్కొన్నారు. రాఘవేంద్ర రావు గారు తనను చిన్నపిల్లలా చూసేవారని చెప్పారు. తన కెరీర్ విజయాలలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు, ఆ సంవత్సరంలో తన సినిమాలు ఎక్కువగా విడుదలైన కారణంగా తనకు కళా సుందరి బిరుదును ప్రదానం చేశారని ఆమె సగర్వంగా తెలిపారు. అలాగే, 14 ఏళ్ల వయసులో, అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి గారి చేతుల మీదుగా తమిళంలో ఒక సినిమాకు గాను ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నీలం సంజీవ రెడ్డి గారు రాష్ట్రపతి అని తనకు తెలియదని, తెలుగు అమ్మాయిగా తమిళంలో అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని ఆయన ఆశీర్వదించారని కవిత తెలిపారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
