
ప్రస్తుతం ఎక్కడ చూసిన రాజమౌళి పేరే వినిపిస్తోంది. ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి తెరకెక్కించిన విధానం.. హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన సినిమాను పాన్ ఇండియా హిట్ గా నిలిపింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం రాజమౌళిని ప్రశంసిస్తుంటే అలనాటి అందాల తార కాంచన జక్కన్న పై సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి తనను అవమానించాడని ఆమె ఆరోపించారు. ఒకప్పుడు అందాల తారగా కాంచన మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో కాంచన నటించి అలరించారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె నటించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాహుబలి సినిమా కోసం రాజమౌళి నన్ను సంప్రదించారు. చిన్న పాత్రే అన్నారు. నేను సరే అని ఐదు లక్షలు రెమ్యునరేషన్ అడిగాను.. నాకు 5 లక్షలు ఇవ్వడానికి రాజమౌళి ఆలోచించాడు. ఆయనకు అది పెద్ద అమౌంట్ కాదు.
కానీ నాకు ఇవ్వడానికి ఆలోచించాడు. అమౌంట్ ఎక్కువ అని భావించి నన్ను వద్దు అన్నాడు. అది భారీ అమౌంట్ కాదు కానీ తన లాంటి వాళ్లకు ఇస్తే సేవలు చేసుకుంటాము కదా అని ఆమె అన్నారు. అదే అమౌంట్ వయసైపోయిన హీరోలకు ఇస్తారు కదా.. అదే నాలాంటి వారికి కూడా ఇవ్వొచ్చు కదా.. నేను మిమల్ని విమర్శించడం లేదు. నాలాంటి ఆర్టిస్టుల కష్టాలను ఉద్దేశించి చెప్తున్నా అని అన్నారు కాంచన