Tollywood: గుర్తుపట్టారా.. ఈ తెలుగు నటిని? షాకింగ్ లుక్.. వైరల్…

ఇప్పుడు 15 నుంచి 20 ఏళ్ల టీనేజర్స్‌కి కూడా తెల్ల జుట్టు వస్తుంది. 30 ఏళ్లు వచ్చేసరికి నల్ల వెంట్రక అనేదే చాలామందికి కనిపించడం లేదు. అలాంటిది 60 ఏళ్లు దాటాక.. తెల్ల జుట్టు లేకుండా ఎలా ఉంటుంది. ఎప్పుడూ జనాల కోసం డై వేసుకోవాలా..? అందుకే అప్పట్లో కలర్ వేయకుండా నేచురల్ లుక్‌లో కనిపించి షాక్ ఇచ్చారు ఈ నటి.

Tollywood: గుర్తుపట్టారా.. ఈ తెలుగు నటిని? షాకింగ్ లుక్..  వైరల్...
Actress Jayasudha

Updated on: Apr 18, 2024 | 7:31 PM

వయస్సు మీద పడుతున్న కొద్దీ.. శరీరంలో మార్పులు చోటుచోసుకుంటూ ఉంటాయి. చర్మంపై ముడతలు వస్తాయి. జుట్టు తెల్లబడుతుంది. ఓపిక తగ్గుతుంది. సెలబ్రిటీలు అయినా సేమ్ సిట్యువేషన్. అయితే వారు తీసుకునే క్వాలిటీ ఫుడ్, మేకప్ వల్ల.. యంగ్‌గా కనిపిస్తూ ఉంటారు.  ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా..? టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్. ఆ తర్వాత అమ్మ పాత్రలకు పెట్టింది పేరు. ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఆమె మరెవరో కాదండీ.. సహజ నటి జయసుధ. ఆమె గతంలో తెల్లు జుట్టుతో కనిపించిన ఫోటో మరోసారి వైరల్‌ అవుతుంది. ఇది కరోనా సమయంలోని ఫోటో. అప్పట్లో ఓ సీరియల్‌ని ప్రమోట్ చేస్తూ చేసిన ఈ వీడియోలో ఆమె లుక్‌ని చూసి అందరూ షాక్‌కి గురయ్యారు. ఆమెది 60 ఏళ్లు పైబడిన వయస్సు. 60 ఏళ్ల వయసలో తెల్ల జుట్టు లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. కాకపోతే.. ఎప్పుడూ అలా చూడని ఆమెను ఒక్కసారిగా వైట్ హెయిర్‌తో చూసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.

జయసుధకు సహజనటి అనే పేరు ఉన్న విషయం తెలిసిందే.  అద్భుతమైన నటనతో దశాబ్దాల పాటు ఆమె తెలుగు ప్రేక్షకులను అలరించారు. NTR, ANR, శోభన్ బాబు, కృష్ణ వంటి అగ్రహీరోల సరసన ఆడిపాడారు. ఆ తర్వాతి కాలంలో అమ్మ పాత్రల్లో అద్బుతంగా ఇమిడిపోయారు. ఇక నయా జనరేషన్ హీరోలకు నాన్నమ్మ, అమ్మమ్మ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. అయితే ఏ పాత్ర వేసినా దానికి ప్రాణం పోయడం జయసుధ ప్రత్యేకత. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆమె జీవించేస్తారు. కాగా ఇటీవలి కాలంలో జయసుధ సినిమాల్లో కనిపించలేదు. తాజాగా ఆమె ఫస్ట్ టైమ్ ఓ ఇంగ్లీషు షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేస్తున్నారు. ఆ అనుభవనాలు ఇన్ స్టాలో అభిమానులతో పంచుకుంటున్నారు. అలానే ప్రభు ఏసుపై పాటలు పాడుతూ అద్భుతమైన గాత్రంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. త్వరలోనే మంచి పాత్రలతో ఆమె ఆడియెన్స్‌ను పలకరించాలని కోరకుందాం.

చెప్పడం మర్చిపోయాం…  జయసుధ స్వచ్చమైన తెలుగువారే. దర్శక నిర్మాత.. విజయ నిర్మల ప్రోత్సాహంతో ఆమె నటిగా రాటుదేలారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.