కోలీవుడ్ సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్ కున్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఆయన ఆదివారం (నవంబర్ 11) చెన్నైలోని రామాపురంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఢిల్లీ గణేష్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కాగా సినీ ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం ఢిల్లీ గణేష్ భౌతిక కాయాన్ని ఇంట్లోనే ఉంచారు. సోమవారం (నవంబర్ 12) ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 400కు పైగా సినిమాల్లో నటించారు ఢిల్లీ గణేష్. ఎక్కువగా విలన్, కమెడియన్ పాత్రలతో ఆడియెన్స్ ను అలరించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ఆయన మెప్పించారు. తూత్తుకుడిలో జన్మించిన ఢిల్లీ గణేష్ 1976లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అతను దక్షిణ భారత నాటక సభ అనే ‘ఢిల్లీ’ థియేటర్ గ్రూప్‌లో సభ్యుడు. సినిమాల్లో నటించడానికి ముందు, ఢిల్లీ గణేష్ 1964 నుండి 1974 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేశారు. ఢిల్లీ గణేష్ మొదటి చిత్రం పట్టినప్రవేశం (1977). దర్శకుడు కె. బాలచందర్ ఆయనను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఢిల్లీ గణేష్ పోషించిన చాలా పాత్రలు సహాయ నటుడు లేదా హాస్యనటుడి పాత్రలే. అయితే అపూర్వ సహోదరులు వంటి సినిమాల్లో విలన్‌గా నటించి దృష్టిని ఆకర్షించాడు. సింధు భైరవి, నాయగన్, మైఖేల్ మదన కామరాజన్, ఆహా మరియు దెనాలి, అవ్వై షణ్ముఖి తదితర సినిమాలు ఢిల్లీ గణేష్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ సినిమాలు తెలుగులోకి విడుదలకావడంతో తెలుగు ఆడియెన్స్ కు కూడా చేరువైపోయారు ఢిల్లీ గణేష్.
1979లో, ఢిల్లీ గణేష్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు, అంతేకాకుండా 1993-1994 సంవత్సరానికి గాను ఢిల్లీ గణేష్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ కలైమామణి అవార్డును అందుకున్నాడు. ఇటీవల కాలంలో ఇండియన్ 2, కాంచన 3, అభిమన్యుడు తదితర సినిమాల్లో కనిపించారు ఢిల్లీ గణేష్.
Veteran Actor #DelhiGanesh (80) passed away in Chennai.. He wasn’t keeping well for sometime..
A fine actor.. Tamil cinema will miss him..
RIP! pic.twitter.com/u7BRrZhGOG
— Ramesh Bala (@rameshlaus) November 10, 2024
తమిళ నటుడు డిల్లీ గణేష్ కన్నుమూత
400 కు పైగా చిత్రాల్లో నటించిన డిల్లీ గణేష్
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న డిల్లీ గణేష్..
నటుడు మరియు నిర్మాతగా పలు సినిమాలతో తెలుగు వారికి పరిచయం ఉన్న డిల్లీ గణేష్ ..#delhiganesh #kollywood pic.twitter.com/Lwvw1FcEta
— suzen (@Suzenbabu) November 10, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. చేయండి.