సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన కుమారుడు రవిబాబు చలపతిరావుకు జుబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన కుటుంబసభ్యులు.. కుమర్తెలతోపాటు.. హీరో మంచు మనోజ్, నిర్మాత సురేష్ బాబు, నిర్మాత దామోదర ప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, డైరెక్టర్ శ్రీవాస్, నటుడు గౌతమ్ రాజు.. పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నెల 24న గుండెపోటుతో చలపతిరావు కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలు రాక ఆలస్యం కావడంతో ఆయన భౌతికకాయాన్నిమహాప్రస్థానంలోని ఫ్రిజర్ బాక్స్ లో ఉంచారు.
బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన భౌతకకాయాన్ని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు. దాదాపు 1200 లకు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు చలపతిరావు. గత వారం రోజుల క్రితం ఆయన కుమారుడు తెరకెక్కిస్తున్న ఓ సినిమాలోనూ కీలకపాత్రలో నటించారు చలపతిరావు.
చలపతిరావుకు సీనియర్ హీరో ఎన్టీఆర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. వీరిద్దరు ఒకే మండలం కావడంతో చలపతిరావు చిత్రపరిశ్రమలోనూ సాయం అందించారు ఎన్టీఆర్. అంతేకాకుండా… నందమూరి కుటుంబానికి చలపతిరావు ఆప్తుడు.